- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IND Vs AFG: సిక్స్‌లు, బౌండరీలతో ఊచకోత.. ఇషాన్ కిషన్, గిల్ సెంచరీల మోత
లక్నో వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 400 టార్గెట్ దిశగా వెళ్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: భారత్, అఫ్గానిస్తాన్ జట్ల మధ్య లక్నోలోని ఏకానా ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో భారత బ్యాటర్లు అఫ్గాన్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు. టాస్ గెలిచిన అఫ్గానిస్తాన్ (Translating...) మొదట ఫీల్డింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా (Team India) 40 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 340 పరుగుల భారీ స్కోరు సాధించి పటిష్ట స్థితిలో నిలిచింది. సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) కేవలం 39 బంతుల్లో 48 పరుగులు అవుటయ్యాడు. రోహిత్ శర్మ తన లిస్ట్-ఎ క్రికెట్ కెరీర్‌లో 14 వేల పరుగుల క్లబ్‌లో చేరి న్యూ రికార్డు క్రియేట్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిపోయాడు. అఫ్గాన్ బౌలర్లను నలుమూలలా బాదుతూ కేవలం 79 బంతుల్లోనే 14 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 125 పరుగులు చేసి క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ వెంటనే నంగేయాలియా ఖరోటే బౌలింగ్‌లో ఇషాన్ అవుట్ అయ్యాడు.
గిల్ కెప్టెన్ ఇన్సింగ్స్..
మరోవైపు బాధ్యతాయుతమైన కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడుతున్న శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) సెంచరీ మార్కు దాటి 149 పరుగులతో క్రిజ్‌లో ఉన్నాడు. అతడికి తొడుగా కొత్త టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 7 పరుగులతో మరో ఎండ్‌లో ఉన్నాడ. అయితే, వీరిద్దరూ కలిసి భారత్‌కు 400 ప్లస్ భారీ స్కోరు అందించే దిశగా ఆడుతున్నారు. అఫ్గానిస్తాన్ బౌలర్లలో రషీద్ ఖాన్, మహ్మద్ సలీమ్, నంగేయాలియా ఖరోటే ఒక్కో వికెట్ తీసుకున్నారు.






