ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేద్దాం

by velandi.Saikiran |

పంగిడిపల్లెకి మంజూరైన ప్రీ ప్రైమరీ స్కూలును వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి రవీందర్ ప్రారంభించారు.

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేద్దాం
X

దిశ, కమలాపూర్: కమలాపూర్ మండలంలోని పంగిడిపల్లె గ్రామానికి మంజూరైన ప్రీ ప్రైమరీ స్కూలును వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తౌటం ఝాన్సీ రాణి రవీందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 5 సంవత్సరాలలోపు పిల్లలకు నర్సరీ, LKG, UKG, విద్యను అందించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రీ ప్రైమరీ స్కూల్ లను మంజూరు చేశారన్నారు. అందుకే స‌ర్కార్ స్కూల్స్ ను ఎంక‌రేజ్ చేయాల‌న్నారు. అనంతరం విద్యార్థులకు బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శ్రీధర్,గ్రామ సర్పంచి కళ్యాణి హెడ్ మాస్టర్ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలపురి కనకరత్నం, యుగంధర్, పోడేటి బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

Next Story