ప్రేయసితో గొడవ.. "చనిపోతా" అంటూ యువకుడు అదృశ్యం

by Taduka Kalyani |

ప్రేయసితో గొడవ జరగడంతో చనిపోతా అంటూ ఓ యువకుడు కనిపించకుండా పోయిన సంఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

ప్రేయసితో గొడవ.. చనిపోతా అంటూ యువకుడు అదృశ్యం
X

దిశ, శంషాబాద్: ప్రేయసితో గొడవ జరగడంతో చనిపోతా అంటూ ఓ యువకుడు కనిపించకుండా పోయిన సంఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్‌కు చెందిన దోసాడ రాహుల్ (32) తిమ్మాపూర్‌లోని ఓ చాక్లెట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల పని ప్రదేశానికి దగ్గరగా ఉండేందుకు ఘన్సిమియాగూడలో స్నేహితుడి గదిలో నివాసం ఉంటున్నాడు.bఈ నెల 16వ తేదీ రాత్రి కంపెనీలో పనిచేస్తున్న తన ప్రేయసి కవితతో ఫోన్‌లో గొడవ జరిగింది. గత మూడేళ్లుగా ఇద్దరూ ప్రేమించుకుంటున్నారు. గొడవ అనంతరం "చనిపోతా" అంటూ రాహుల్ తన ద్విచక్ర వాహనంపై గది నుంచి వెళ్లిపోయినట్లు సహోద్యోగులు తెలిపారు. బుధవారం ఉదయం నుంచి రాహుల్ ఫోన్ స్విచ్ ఆఫ్‌లో ఉండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. బంధువులు, స్నేహితులు, పని చేసే ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభించకపోవడంతో శంషాబాద్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story