- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : వరుసగా రెండు పరాజయాలతో ఢీలా పడిన భారత్ ‘ఏ’ జట్టు తాడోపేడో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో మాత్రం రప్ఫాడించింది. బుధవారం అఫ్గానిస్తాన్ ‘ఏ’ను మట్టికరిపించి ట్రై సిరీస్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. దంబుల్లా వేదికగా జరిగిన ఈ గేములో ఇండియా ‘ఏ’ ఏకంగా 101 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఆల్‌రౌండ్ షోతో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇండియా 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 319 పరుగులు చేసింది. కెప్టెన్ తిలక్ వర్మ(59), ప్రియాన్ష్ ఆర్య(58), కుమార్ కుశాగ్రా(58) హాఫ్ సెంచరీలతో రాణించారు. మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ(38), రుతురాజ్ గైక్వాడ్(30), విప్రాజ్ నిగమ్(30) పర్వాలేదనిపించారు. ఇక, చేజింగ్‌లో అఫ్గాన్ ‘ఏ’ కనీస పోరాటం చేయలేకపోయింది. భారత బౌలర్ నిశాంత్ సింధు 4 వికెట్లతో విజృంభించి ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. అతనికి ఇతర బౌలర్లు కూడా తోడవడంతో అఫ్గాన్ విలవిలలాడిపోయింది. 36.5 ఓవర్లలోనే 218 పరుగులే చేసి కుప్పకూలింది. ఆ జట్టులో బహిర్ షా(57), ఫైజల్ షినోజాడా(46), ఇమ్రాన్ మిర్(32) మాత్రమే పర్వాలేదనిపించారు. 101 పరుగుల విక్టరీతో భారీగా నెట్‌రన్‌రేట్ పోగు చేసుకున్న భారత్ నేరుగా ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఆదివారం ఫైనల్ జరగనుంది. శ్రీలంక, అఫ్గాన్ ‘ఏ’ జట్లలో ఒకటి ఫైనల్‌కు రానుంది.






