గొర్రెలా కాదు.. తోడేలులా జీవించాలి.. అంచనాలను పెంచుతున్న ‘ఆల్ఫా’ ట్రైలర్

by Mallepaka Hamsa |

ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ మేకర్స్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.గ్లోబల్ టాప్ డీజే హ్యూజెల్ పాపులర్ ట్రాక్ ‘జమైకన్ బామ్ బామ్’ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ట్రైలర్ విజువల్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి.

గొర్రెలా కాదు.. తోడేలులా జీవించాలి.. అంచనాలను పెంచుతున్న ‘ఆల్ఫా’ ట్రైలర్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, శార్వరి వాఘ్, బాబీ డియోల్, అనిల్ కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ మూవీ ‘ఆల్ఫా’. బాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ తమ స్పై యూనివర్స్ నుండి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శివ్ రావల్ దర్శకత్వం వహించగా, ఉదయ్ చోప్రా కథను అందించారు. ఈ మూవీలో అలియా భట్ అత్యంత కఠినమైన శిక్షణ పొందిన ప్రొఫెషనల్ కిల్లర్ ‘సీత’ పాత్రలో కనిపించారు. తనను పెంచి పెద్ద చేసిన మెంటారే.. ఆ తర్వాత శత్రువుగా బాబీ డియోల్ మారడంతో, అతడిని అంతం చేయడానికి సీత చేసే పోరాటమే ఈ సినిమా కథ. ఏక్ థా టైగర్, పఠాన్, వార్ సిరీస్ లాంటి బ్లాక్‌బస్టర్స్ తర్వాత YRF స్పై యూనివర్స్ నుండి వస్తున్న 7వ చిత్రమైన ఈ ‘ఆల్ఫా’.. జులై 3న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈనేపథ్యంలో.. తాజాగా, ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ మేకర్స్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

గ్లోబల్ టాప్ డీజే హ్యూజెల్ పాపులర్ ట్రాక్ ‘జమైకన్ బామ్ బామ్’ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ట్రైలర్ విజువల్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. మరీ ముఖ్యంగా శార్వరి వాఘ్‌తో కలిసి ఆలియా భట్ చేసిన భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, హెవీ కాంబాయ్ ట్రైనింగ్ సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి. ట్రైలర్‌లో భారతదేశపు తదుపరి తరం సైనికులను తయారు చేసే రహస్య ప్రొగ్రామ్ ‘ఆల్ఫా’ చుట్టూ కథ తిరుగుతున్నట్లు చూపించారు. ‘‘గొర్రెలా కాదు.. తోడేలులా జీవించాలి’’ అనే పవర్ ఫుల్ డైలాగ్ అంచనాలను పెంచుతోంది. ‘‘ఈసారి లంకను తగలబెట్టడానికి సీత స్వయంగా వచ్చింది.. అగ్నిపరీక్ష మొదలుపెట్టండి’’ అంటూ అలియా భట్ చెప్పే పవర్‌ఫుల్ డైలాగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ ట్రైలర్‌లో అందరికీ పెద్ద సర్‌ప్రైజ్ ఇస్తూ.. ‘వార్’ సినిమా నాటి ‘కబీర్’ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ స్పెషల్ అప్పీయరెన్స్‌ ఇచ్చి ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించారు.



Next Story