బైక్ అదుపుతప్పి యువకుడి మృతి

by Taduka Kalyani |

మద్యం మత్తులో బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తి అదుపుతప్పి కింద పడటంతో మృతి చెందిన సంఘటన నార్సింగి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.

బైక్ అదుపుతప్పి యువకుడి మృతి
X

దిశ, గండిపేట: మద్యం మత్తులో బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తి అదుపుతప్పి కింద పడటంతో మృతి చెందిన సంఘటన నార్సింగి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. కాళీమందిర్ సమీపంలో టీజీపీఏ వైపు నుంచి కాళీమందిర్ దిశగా వెళ్తున్న కేటీఎం బైక్ పై వెళ్తున్న వ్యక్తి అతివేగం, మద్యం మత్తు కారణంగా అదుపుతప్పి రోడ్డుమధ్యలో ఉన్న ప్రకటన బోర్డును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, వెనుక కూర్చున్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని షాదాన్ ఆస్పత్రికి తరలించగా, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story