- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ సమస్యలు తీరితేనే హైదరాబాద్ క్రికెట్‌కు ఫ్యూచర్: మంత్రి అజహరుద్దీన్ షాకింగ్ కామెంట్స్
ఉప్పల్ స్టేడియంలో హెచ్‌సీఏ నిర్వహిస్తున్న TG20 లీగ్ వేళ రాష్ట్ర మంత్రి మొహమ్మద్ అజహరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ క్రికెట్ భవితవ్యంపై మంత్రి, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ (Mohammad Azharuddin) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ నగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘TG20 లీగ్’పై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం హెచ్‌సీఏలో చాలా సమస్యలు ఉన్నాయని అన్నారు. గ్రూపు రాజకీయాలు, అంతర్గత విభేదాలు క్రికెట్ అభివృద్ధికి అడ్డంకిగా మారాయని కామెంట్ చేశారు. హెచ్‌సీఏలో ఉన్న లొసుగులు, సమస్యలను పూర్తిగా పరిష్కరించనంత కాలం.. హైదరాబాద్ క్రికెట్ ఏమాత్రం వృద్ధి చెందదని, ఇక్కడి నుంచి కొత్తగా ప్రతిభావంతులు ముందుకు రాలేరని అజారుద్దీన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలోని యువ క్రికెటర్లను ప్రోత్సహించేందుకు TG20 లీగ్ వంటి వేదికలు అవసరమేనని, అసోసియేషన్ మేనేజ్‌మెంట్‌లో పారదర్శకత లోపించిందని మంత్రి అజహరుద్దీన్ అన్నారు. గతంలో తాను హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్న సమయం నుంచి ఇప్పటి వరకు కొన్ని వ్యవస్థాగత లోపాలు అలాగే కొనసాగుతున్నాయని తెలిపారు. వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. క్రీడాకారుల ఎంపిక, మౌలిక వసతుల కల్పనలో రాజకీయాలు పక్కన పెట్టి, క్రికెట్ సంక్షేమం కోసమే నిర్ణయాలు తీసుకోవాలని మంత్రి అజారుద్దీన్ అన్నారు.






