- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణకు రెయిన్ అలర్డ్.. రేపు ఉదయం వరకు ఈ జిల్లాల్లో వర్షాలు
తెలంగాణలో ఓవైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో నేడు ఉదయం నుండి పలు ప్రాంతాల్లో వర్షం కురవగా, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎండలు మండిపోయాయి.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో ఓవైపు ఎండలు మండిపోతుంటే మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో నేడు ఉదయం నుండి పలు ప్రాంతాల్లో వర్షం కురవగా, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఎండలు మండిపోయాయి. ఉష్ణోగ్రతలు వేడెక్కడంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందిపడ్డారు. ఇలాంటి సమయంలో వెదర్ మ్యాన్ బాలాజీ రాష్ట్రానికి చల్లనికబురు చెప్పారు. రాత్రి 1.30 గంటల తరవాత ఉదయం 5.30 గంటల వరకు వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. మరో రెండు గంటల్లో నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. జగిత్యాల, మంచిర్యాల,పెద్దపల్లి, అసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు, వికారాబాద్, కరీంనగర్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణ్ పేట్ జిల్లాల్లో తేలికపాటి నుండి మధ్యస్థ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక హైదరాబాద్ లోనూ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిస్తే మరికొన్ని ప్రాంతాల్లో పొడివాతావరణం ఉంటుదని తెలిపారు.






