- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనం.. ఏకంగా 10 మందిపై పోక్సో కేసు నమోదు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి (Annapureddipalli) పీఎస్ పరిధిలో సంచలనం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి (Annapureddipalli) పోలీస్ స్టేషన్ పరిధిలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఇద్దరు మైనర్లపై గ్రామ పెద్దలు విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన పోలీసులు 10 మంది గ్రామ పెద్దమనుషులపై ఏకంగా పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు.ః
బాలుడిని చెట్టుకు కట్టేసి దాడి..
స్థానికుల కథనం ప్రకారం.. అన్నపురెడ్డిపల్లి మండల పరిధిలోని ఓ గ్రామంలో మైనర్ బాలిక, మైనర్ బాలుడు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో కొందరు గ్రామ పెద్దలు ఒక్కసారిగా వారిపై దాడికి దిగారు. వారిని కనీసం విచారింకుండానే సదరు బాలుడిని పట్టుకుని వీధిలోకి ఈడ్చుకొచ్చి, విచక్షణారహితంగా కొడుతూ ఊరి మధ్యలో ఉన్న ఓ చెట్టుకు కట్టేశారు. బాలికపై కూడా తీవ్రంగా దుర్భాషలాడారు. అయితే, బాధిత బాలుడు, ఆ బాలికకు వరుసకు అన్నయ్య అవుతాడని సమాచారం. అన్నాతెల్లెళ్ల బంధాన్ని కూడా అర్థం చేసుకోకుండా, కేవలం అనుమానంతో గ్రామ పెద్దమనుషులు అనాగరికంగా వ్యవహరించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
రంగంలోకి పోలీసులు.. 10 మందిపై పోక్సో కేసు
తీవ్ర గాయాలపాలైన మైనర్ బాలుడి పరిస్థితిని చూసి తీవ్ర ఆగ్రహానికి గురైన అతడి కుటుంబ సభ్యులు వెంటనే అన్నపురెడ్డిపల్లి పోలీసులను ఆశ్రయించారు. మైనర్లపై అకృత్యానికి పాల్పడిన గ్రామస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఘటనపై సమగ్ర విచారణ జరిపారు. మైనర్ల పట్ల క్రూరంగా ప్రవర్తించడం, బాలికను అవమానించడం వంటి తీవ్రమైన సెక్షన్లతో పాటు, మైనర్లపై జరిగిన అకృత్యం కావడంతో మొత్తం 10 మంది నిందితులపై పోక్సో (POCSO) కేసు నమోదు చేశారు.






