- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉస్మానియా యూనివర్సిటీ మరో ఘనత.. ISO గుర్తింపు
ఉస్మానియా విశ్వవిద్యాలయం (OU) మరో రికార్డ్ సాధించింది.

దిశ, వెబ్ డెస్క్ : ఉస్మానియా విశ్వవిద్యాలయం (OU) మరో రికార్డ్ సాధించింది. వర్శిటీ చరిత్రలో మొదటిసారి నాలుగు విభాగాలకు ISO గుర్తింపు పొందడం మైలురాయిగా నిలిచింది. దేశంలోనే మరే ఇతర విశ్వవిద్యాలయానికి సాధ్యం కాని రీతిలో, ఒకేసారి నాలుగు వేర్వేరు విభాగాల్లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ద్వారా అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ (ISO) గుర్తింపు సాధించి ఓయూ సరికొత్త రికార్డు సృష్టించింది. హైదరాబాద్‌లోని యూనివర్సిటీ క్యాంపస్‌లో బుధవారం జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో, దక్షిణ ప్రాంత BIS డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సందీప్ కుమార్ కనోజియా చేతుల మీదుగా ఓయూ వైస్ ఛాన్సలర్ ఆచార్య కుమార్ ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ధ్రువపత్రాలను అందుకున్నారు.
ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలకు గాను ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ విభాగానికి (ISO 21001:2018), క్యాంపస్‌లో పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణకు గాను ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌కు (ISO 14001:2015) ఈ గుర్తింపు లభించింది. వీటితో పాటు విద్యుత్, ఇంధన వనరుల పొదుపు విభాగంలో ఎనర్జీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌కు (ISO 50001:2018), అలాగే యూనివర్సిటీ హాస్టళ్లు, క్యాంటీన్లలో పరిశుభ్రమైన ఆహార ప్రమాణాలను పాటించినందుకు ఫుడ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ విభాగంలో (ISO 22000:2018) ఓయూ ఈ ఘనతను దక్కించుకుంది. భారతదేశంలోనే ఇలా ఒకేసారి నాలుగు విభిన్న విభాగాల్లో బీఐఎస్ (ISO) గుర్తింపు సాధించడం గర్వంగా ఉందని వీసీ సంతోషం వ్యక్తం చేసారు.






