- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇథనాల్ పెట్రోల్ కు చీమలు పడతాయా?
ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (E20)కు చీమలు పడతాయా అనే ప్రశ్న ప్రస్తుతం వాహనదారులను వెంటాడుతోంది.

దిశ, వెబ్ డెస్క్ : ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (E20)కు చీమలు పడతాయా అనే ప్రశ్న ప్రస్తుతం వాహనదారులను వెంటాడుతోంది. E20 వల్ల వాహనాల ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర చీమలు, తేనెటీగలు చేరుతున్నాయని సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే ఇది చాలా మంది వాహనదారులు ప్రాక్టికల్‌గా ఎదుర్కొంటున్న నిజమైన సమస్యగా తెలుస్తోంది. చమురు సంస్థలు, ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగాలు దీనిని అపోహ అని కొట్టిపారేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి బలమైన కారణాలు ఉన్నాయి. సాంకేతికంగా ఇథనాల్ తయారీ ప్రక్రియలో చక్కెర పూర్తిగా తొలగిపోతుంది కాబట్టి అందులో తీపిదనం ఉండదనేది నిజమే అయినప్పటికీ, కీటకాలు ఆకర్షితమవడానికి చక్కెర ఒక్కటే కారణం కాదు.
ఇథనాల్‌కు సహజంగానే పండ్లు పులియబెట్టినప్పుడు వచ్చే ఒక రకమైన తీపి వాసన (Sweet Aroma) ఉంటుంది. చీమలు, తేనెటీగలు ఆహారాన్ని గుర్తించడానికి తమ యాంటెన్నాల ద్వారా వాసనలపైనే ఆధారపడతాయి కాబట్టి, ఈ ఇథనాల్ ఆవిరిని చూసి అవి ఆహారంగా పొరబడతాయి. దీనికి తోడు ఇథనాల్‌కు గాల్లోని తేమను ఆకర్షించే గుణం ఉంటుంది. పెట్రోల్ పోసేటప్పుడు క్యాప్ చుట్టూ ఒకటి రెండు చుక్కలు కిందపడినా, అది గాల్లోని తేమతో కలిసి కీటకాలను ఆకర్షించే వాతావరణాన్ని సృష్టిస్తుంది.
ఈ సమస్య నుండి బయటపడటానికి వాహనదారులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపిన తర్వాత ట్యాంక్ చుట్టూ పెట్రోల్ చుక్కలు పడకుండా చూసుకోవాలి, ఒకవేళ పడితే వెంటనే తుడిచేయాలి. అలాగే ఫ్యూయల్ క్యాప్ లోపల ఉండే రబ్బర్ వాషర్ (Gasket) సరిగ్గా ఉందో లేదో చూసుకోవడం ముఖ్యం, ఎందుకంటే అది లూజ్ అయితే లోపలి ఆవిరి బయటకు వచ్చి చీమలను లాగుతుంది. ట్యాంక్ పరిసరాల్లో కొద్దిగా నిమ్మరసం లేదా వెనిగర్ కలిపిన నీటితో క్లీన్ చేయడం వల్ల ఆ ఘాటైన వాసనకు చీమలు రాకుండా దూరంగా ఉంటాయి.
- Tags
- E20 Petrol
- Ants






