- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీసేవా కేంద్రాలకు సర్కార్ కీలక ఆదేశాలు.. ఇకపై అవి ఉండవు
తెలంగాణలో జూన్ 19 నుంచి మీసేవా కేంద్రాల్లో రిసీప్ట్ లు SMS ద్వారా మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో మీసేవా (Meeseva) సేవ కేంద్రాలకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.. పర్యావరణ పరిరక్షణతో పాటు డిజిటలైజేషన్‌ను మరింత వేగవంతం చేసే ఉద్దేశంతో, తెలంగాణ ప్రభుత్వం జూన్ 19 నుంచి మీసేవా కేంద్రాల్లో కాగితపు రిసీప్టుల విధానానికి స్వస్తి పలికి, కేవలం SMSల ద్వారా మాత్రమే రశీదులు ఇవ్వాలని సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ సరికొత్త నిర్ణయం ప్రకారం, ఇకపై మీసేవా కేంద్రంలో ఏదైనా సర్టిఫికెట్ లేదా సేవ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు మీకు చేతికి కాగితపు రశీదు ఇవ్వరు. దానికి బదులుగా, మీరు రిజిస్టర్ చేసేటప్పుడు ఇచ్చిన యాక్టివ్ మొబైల్ నంబర్‌కు నేరుగా ఒక ఎస్ఎంఎస్ (SMS) వస్తుంది. ఈ డిజిటల్ రిసీప్ట్‌లోనే మీరు అప్లై చేసిన సేవ పేరు, చెల్లించిన ఫీజు వివరాలు, ట్రాన్సాక్షన్ వివరాలు, అత్యంత ముఖ్యమైన అప్లికేషన్ నంబర్ (Application Number) వంటి అన్ని వివరాలు స్పష్టంగా ఉంటాయి.
దీనివల్ల కాగితాలు పోగొట్టుకునే భయం ఉండదు. ఎప్పుడైనా మొబైల్లోనే స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అయితే అప్లికేషన్ ఇచ్చేటప్పుడు ప్రస్తుతం వాడుకలో ఉన్న కరెక్ట్ మొబైల్ నంబర్‌ను మాత్రమే ఇవ్వాలని, లేదంటే.. రిసీప్ట్ రాకపోవడమే కాకుండా, భవిష్యత్తులో అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడం కష్టమవుతుంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ పేపర్‌లెస్, పర్యావరణ హిత నిర్ణయం రాష్ట్రంలో డిజిటల్ సేవల రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందని నిపుణులు భావిస్తున్నారు.






