Tesla: హైదరాబాద్‌లో టెస్లా గ్రాండ్ ఎంట్రీ

by S Gopi |

ఇక్కడ కంపెనీ తన కొత్త మోడల్ వై ప్రీమియం రియర్-వీల్ డ్రైవ్, మోడల్ వై ఎల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను విక్రయానికి ఉంచింది.

Tesla: హైదరాబాద్‌లో టెస్లా గ్రాండ్ ఎంట్రీ
X

దిశ, బిజినెస్ బ్యూరో: ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఈవీ కార్ల బ్రాండ్ టెస్లా దేశంలో తన కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా బుధవారం హైదరాబాద్‌లో తొలి ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించింది. హైటెక్ సిటీలోని నాలెడ్జ్ సిటీలో ఏర్పాటైన ఈ సెంటర్ దేశంలో టెస్లాకు ఐదవది కాగా, తెలంగాణలో మొదటిది. ఇక్కడ కంపెనీ తన కొత్త మోడల్ వై ప్రీమియం రియర్-వీల్ డ్రైవ్, మోడల్ వై ఎల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను విక్రయానికి ఉంచింది. మోడల్ వై ధర రూ.50.89 లక్షల నుంచి ప్రారంభమవుతుండగా, 500 కిలోమీటర్ల వరకు డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుంది. మరోవైపు, ఆరు సీట్ల లేఅవుట్‌తో వచ్చే మోడల్ వై ఎల్ ధర రూ.61.99 లక్షలకు లభిస్తుండగా, ఇది 681 కిలోమీటర్ల వరకు రేంజ్‌ను అందిస్తుంది. ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌తో పాటు బొల్లారం సెంటర్ నుంచి డెలివరీలు, అమ్మకాల తర్వాత సర్వీసును కూడా టెస్లా ప్రారంభించింది. ఇప్పటికే రెండు మోడళ్ల బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. జూన్ 30లోపు ఆర్డర్ చేసే వినియోగదారులకు ఉచిత హోమ్ వాల్ కనెక్టర్ ఛార్జర్‌ను కూడా అందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

Next Story