- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పట్టపగలే దొంగతనం
by velandi.Saikiran |
శేరిపల్లి గ్రామంలో ఓ ఇంటి తాళాలను పగలగొట్టి దాదాపుగా లక్ష రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలను చోరీ చేశారు దుండగులు.

X
దిశ, భూత్పూర్ : మండల పరిధిలోని శేరిపల్లి ( హెచ్) గ్రామంలో ఓ ఇంటి తాళాలను పగలగొట్టి దాదాపుగా లక్ష రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలను చోరీ చేశారు దుండగులు. వివరాలలోకి వెళితే గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల నరసింహులు కుటుంబం రోజువారి మాదిరిగానే ఇంటికి తాళం వేసి తమ తమ పనులపై బయటకు వెళ్లారు. ఈ క్రమంలో మధ్యాహ్నం ఇంటి తాళాలు బద్దలు కొట్టి, దొంగతనం చేశారు. సాయంత్రానికి ఇంటికి వచ్చిన నరసింహులు తలుపులు బద్దలు కొట్టి ఉండడం గమనించి ఇంట్లో దొంగతనం జరిగినట్లుగా గుర్తించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో భూత్పూర్ ఎస్సై సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి కేసు నమోదు చేసినట్లు సమాచారం.
Next Story






