- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పటేల్ కుంట చెరువులో గుర్రపు డెక్క తొలగింపు పనులు ప్రారంభం
హెచ్ఎంటి నగర్ పరిధిలోని పటేల్ కుంట చెరువులో నెలకొన్న గుర్రపు డెక్క తొలగింపు పనులను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్, మేడల మల్లికార్జున్ గౌడ్ పర్యవేక్షించారు.

దిశ, నాచారం: హెచ్ఎంటి నగర్ పరిధిలోని పటేల్ కుంట చెరువులో నెలకొన్న గుర్రపు డెక్క తొలగింపు పనులను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాయిజెన్ శేఖర్, మేడల మల్లికార్జున్ గౌడ్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సాయిజెన్ శేఖర్ మాట్లాడుతూ.. హెచ్ఎంటి నగర్ పెద్ద చెరువు పటేల్ కుంట చెరువులలో గుర్రపు డెక్క తొలగింపు పనుల కోసం గత ఏడాది నవంబర్ నెలలోనే రూ.1.20 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు ప్రారంభించలేదన్నారు. హెచ్ఎంటి నగర్ పెద్ద చెరువు సుందరీకరణ పనులను హైడ్రా చేపట్టడంతో, రెండు చెరువుల పనులను ఒకేసారి నిర్వహించడం సాధ్యం కాదని పేర్కొంటూ కాంట్రాక్టర్ పటేల్ కుంట చెరువు పనులను రద్దు చేసుకున్నట్లు తెలిపారు.
ఈ విషయాన్ని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి జోనల్ కమిషనర్‌తో చర్చించి పటేల్ కుంట చెరువులో గుర్రపు డెక్క తొలగింపునకు ప్రత్యేకంగా టెండర్ పిలిపించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం పనులు ప్రారంభమైన నేపథ్యంలో త్వరలోనే చెరువులోని గుర్రపు డెక్కను పూర్తిస్థాయిలో తొలగించి, అనంతరం చెరువును ఖాళీ చేసే పనులను కూడా చేపడతామని సాయిజెన్ శేఖర్ తెలిపారు. ఈ చర్యలతో చెరువు పరిరక్షణతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కట్ట బుచ్చన్న గౌడ్, రమణారెడ్డి, రాంచందర్, మంగోల్ శివ, సుగుణాకర్ రావు, వాసు, రోహిత్, శ్రీనివాస్, యూసుఫ్, బొట్టు మల్లికార్జున్, కుమార్, భాను, శివ, ఈశ్వర్, పోతరాజు కార్తీక్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.






