సర్కారు బడుల ప్రగతికి రూ. 7.5 కోట్లు

by Taduka Kalyani |

మెదక్ నియోజకవర్గంలో ప్రభుత్వ స్కూల్ లలో ప్రహరీ గోడ నిర్మాణాలకు రూ 7.50 కోట్లు మంజూరైనట్లు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనం పల్లి రోహిత్ రావు తెలిపారు.

సర్కారు బడుల ప్రగతికి రూ. 7.5 కోట్లు
X

దిశ, మెదక్ ప్రతినిధి : మెదక్ నియోజకవర్గంలో ప్రభుత్వ స్కూల్ లలో ప్రహరీ గోడ నిర్మాణాలకు రూ 7.50 కోట్లు మంజూరైనట్లు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనం పల్లి రోహిత్ రావు తెలిపారు. మెదక్ నియోజక వర్గంలోని కాంపౌండ్ వాల్ లేని పాఠశాలకు నిధులు వచ్చాయన్నారు. ఇందులో పాపన్నపేట మండలంలో 21 పనులకు 2 కోట్లు, చిన్న శంకరం పేట మండలంలో 18 పనులకు 1.57 కోట్లు, హవేలీ ఘనపూర్ మండలం లో 17 పనులకు 1.38 కోట్లు, రామాయంపేట మండలంలో 8 పనులకు 75 లక్షలు, నిజాంపేట మండలంలో 7 పనులకు 45 లక్షలు, మెదక్ మండలంలో 5 పనులకు రూ 50 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. నియోజక వర్గంలో 81 పాఠశాలలకు ప్రహరీ గోడల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఈ నిధులతో ప్రభుత్వ బడులకు రక్షణ గా ఉంటుందని, అన్ని పాఠశాలకు ప్రహరీ నిర్మాణం జరుగుతుందని తెలిపారు.

Next Story