ప్రతి యువకుడికి విజయ్ జీవితం ఒక గొప్ప స్ఫూర్తి.. సమంత ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |

ఈ రోజు చెన్నైలో అడుగుపెట్టగానే తనలో ఒక తెలియని ఆనందం కలిగిందని, సీఎం విజయ్ గారిని కలవడం ఒక అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు.

ప్రతి యువకుడికి విజయ్ జీవితం ఒక గొప్ప స్ఫూర్తి.. సమంత ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత త్వరలో ‘మా ఇంటి బంగారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నందిని రెడ్డి దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని సమంత తన సొంత బ్యానర్‌ ట్రాలాలా పిక్చర్స్‌పై భర్త రాజ్ నిడిమోరుతో కలిసి నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 19న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈనేపథ్యంలో ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీ అయిపోయిన సమంత వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజాగా, చెన్నైకి వెళ్లిన సమంత సీఎం విజయ్‌ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలుపుతూ.. ఎమోషనల్ అయ్యారు. ఈ రోజు చెన్నైలో అడుగుపెట్టగానే తనలో ఒక తెలియని ఆనందం కలిగిందని, సీఎం విజయ్ గారిని కలవడం ఒక అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందని ఆమె పేర్కొన్నారు. విజయ్ సార్ ఎప్పుడూ వెండితెరకే పరిమితమయ్యే హీరో కాదని, ఆయన అంతకంటే పెద్ద లక్ష్యం కోసమే పుట్టారని తనకు ముందే అనిపించిందని ఆమె తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానంలో ఉండి, అంతా సాధించిన తర్వాత వాటన్నింటినీ వదిలేసి రాజకీయాలనే ఒక సరికొత్త రంగంలోకి రావడం సామాన్యమైన విషయం కాదని ఆమె ప్రశంసించారు. ఎంతో ధైర్యం, సమాజంపై బాధ్యత ఉంటేనే ఇలాంటి నిర్ణయం తీసుకోగలరని కొనియాడారు. కేవలం పదవి కోసం కాకుండా, ప్రజలకు మంచి చేయాలనే బలమైన సంకల్పంతోనే ఆయన పాలిటిక్స్‌లోకి వచ్చారని, తనను నమ్మిన వారిని విజయ్ సార్ ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తారని ఆమె నమ్మకం వ్యక్తం చేశారు. ఆయన ఎంచుకున్న ఈ కొత్త ప్రయాణంలో విజయ్ సార్‌కు మరింత శక్తి, వివేకం లభించాలని కోరుకుంటూ.. సమాజం కోసం ముందడుగు వేయాలనుకునే ప్రతి యువకుడికి విజయ్ జీవితం ఒక గొప్ప స్ఫూర్తి అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

Next Story