- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు.

దిశ, రాజేంద్రనగర్, గండిపేట్ : అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. బుధవారం రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలోని రాజేంద్రనగర్, భగవతి గూడ, కిస్మాత్ పూర్, బండ్లగూడ, కాళికా నగర్, సూర్యోదయ కాలనీ, శ్రీనివాస ఎంక్లేవ్, రాధ రియాలిటీ, ప్రతాప్ నగర్, శివ సాయి ఫేస్ 2 ప్రాంతాలలో 216.50 లక్షల రూపాయలతో చేపడుతున్న సిసి రోడ్డు, భూగర్భ డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తోందని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని ఆయన పేర్కొన్నారు. క్షేత్ర స్థాయిలో అధికారులు చిత్తశుద్ధితో పని చేయాలని, ఎక్కడా అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా పనులు జరగాలని సూచించారు .పనులు నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ లను ఆదేశిం చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాజేంద్రనగర్ డివిజన్ అధ్యక్షులు బొక్క ప్రభాకర్ రెడ్డి సీనియర్ నాయకులు పలుగుచెరువు మహేష్ , సాగర్ గౌడ్, మహేందర్ గౌడ్, సురేష్ గౌడ్, పూలపల్లి కృష్ణారెడ్డి, పాపయ్య యాదవ్, రగడంపల్లి శ్రవణ్ కుమార్, వర్రీ లలిత్ ,అనుముల జాన్ పాల్ , శ్రీనివాస్ ,పెండ్యాల శ్రీధర్, నయీమ్ భాయ్ ,భరత్ రెడ్డి , సిరాజ్ , యాదమ్మ యాదవ్ ,జాన్సీ రాణి ,మాదవి, నందిగామ నర్సింహా , శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.






