నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం..

by Taduka Kalyani |

ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో జిల్లాలో నకిలీ,నాణ్యతలేని, నిషేధిత విత్తనాల విక్రయాలపై జిల్లా యంత్రాంగం ఉక్కుపాదం మోపిందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు.

నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం..
X

దిశ,ఆదిలాబాద్ : ఖరీఫ్ సీజన్ నేపథ్యంలో జిల్లాలో నకిలీ,నాణ్యతలేని, నిషేధిత విత్తనాల విక్రయాలపై జిల్లా యంత్రాంగం ఉక్కుపాదం మోపిందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలు జిల్లావ్యాప్తంగా 220 ఎరువులు, విత్తనాల దుకాణాలను తనిఖీ చేసి, ఏడు ఘటనల్లో 18 మందిపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.తనిఖీల్లో రూ.10.20 లక్షల విలువైన 1,181 పత్తి విత్తన ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపినట్లు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే లైసెన్సులు కూడా రద్దు చేస్తామని హెచ్చరించారు.రైతులు కేవలం లైసెన్స్ పొందిన దుకాణాల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలని, ప్రతి కొనుగోలుకు బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.నకిలీ లేదా నిషేధిత విత్తనాలపై సమాచారం ఉంటే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు తెలియజేయాలని కలెక్టర్ తెలిపారు.

Next Story