- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండు, మూడు రోజుల్లో యూరియా బుకింగ్ యాప్ ప్రారంభం
రెండు, మూడు రోజుల్లో యూరియా బుకింగ్ యాప్ ప్రారంభం కానున్నట్లు కలెక్టర్ కోయ శ్రీ హర్ష బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

దిశ, పెద్దపల్లి : ప్రస్తుత వానాకాలం-2026 సీజన్‌కు సంబంధించి పెద్దపల్లి జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేటికి జిల్లాలో 18,750 మెట్రిక్ టన్నుల యూరియా, యూరియా బస్తాలు నిల్వలో ఉండి, యూరియా బుకింగ్ యాప్ ద్వారా పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ప్రతి వారం రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ తో పాటు ఇతర కంపెనీల నుంచి యూరియా నిల్వలు జిల్లాకు చేరుతున్నాయని పేర్కొన్నారు.
ప్రస్తుత వానాకాలం సీజన్‌లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎరువుల సరఫరాపై వ్యవసాయ శాఖ పకడ్బందీ ప్రణాళికతో పనిచేస్తోందని కలెక్టర్ తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడం వల్ల పంటల విత్తనాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం యూరియా బుకింగ్ యాప్‌ను తాత్కాలికంగా నిలిపివేశామని, మరో రెండు లేదా మూడు రోజుల్లో యాప్‌ను తిరిగి ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. పెద్దపల్లి జిల్లా రైతులు అందరూ యూరియా బస్తాల లభ్యతపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.






