- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హారర్ సినిమాతో భయపెట్టేందుకు సిద్ధమైన జాక్వెలిన్ ఫెర్నాండేజ్
ఇప్పటివరకు గ్లామర్ పాత్రలు, కమర్షియల్ సినిమాలకే పరిమితమైన ఆమె ఇప్పుడు తన కెరీర్‌లోనే మొదటిసారిగా ఒక అవుట్-అండ్-అవుట్ ప్యూర్ హారర్ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇటీవల ‘హౌస్‌ఫుల్ 5’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం భారీ యాక్షన్ కామెడీ మూవీ ‘వెల్కమ్ టూ ది జంగిల్’ సినిమా షూటింగ్ పనుల్లో బిజీ అయిపోయారు. ఈక్రమంలో.. తాజాగా, జాక్వెలిన్ తన తదుపరి సినిమా కోసం ఓ ప్రయోగం చేయనున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. తన కెరీర్‌లో ఇంతవరకు చేయని ఒక సరికొత్త జోనర్‌లోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు గ్లామర్ పాత్రలు, కమర్షియల్ సినిమాలకే పరిమితమైన ఆమె ఇప్పుడు తన కెరీర్‌లోనే మొదటిసారిగా ఒక అవుట్-అండ్-అవుట్ ప్యూర్ హారర్ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.
ఖ్యాతి మదన్ నేతృత్వంలోని నాట్ అవుట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కనుందట. పూర్తి స్థాయి భయానక వాతావరణంతో, బలమైన ఎమోషన్స్, మంచి సంగీతంతో సాగనుందని తెలుస్తోంది. జాక్వెలిన్ సరసన ఇద్దరు యంగ్ హీరోలు ముఖ్య పాత్రల్లో నటించనున్నారట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఒక టీజర్, సాంగ్ షూట్ కూడా పూర్తయ్యాయని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నటీనటులు వర్క్‌షాప్స్‌లో బిజీగా ఉండగా, జూన్ నెలాఖరు నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కానుందట. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి.






