- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, యైటింక్లయిన్ కాలనీ: సింగరేణి సంస్థలో కార్మికుల భద్రతకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ "జీరో యాక్సిడెంట్" లక్ష్య సాధనకు అధికారులు, కార్మికులు సమిష్టిగా కృషి చేయాలని రామగుండం రీజియన్ జనరల్ మేనేజర్ (సేఫ్టీ) మల్లారపు మల్లయ్య పిలుపునిచ్చారు. రామగుండం-2 ఏరియాకు తొలిసారిగా విచ్చేసిన ఆయనకు బుధవారం జీఎం కార్యాలయంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఏరియా జనరల్ మేనేజర్ బండి వెంకటయ్య ఆధ్వర్యంలో అధికారులు మల్లయ్యను శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మల్లారపు మల్లయ్య మాట్లాడుతూ సింగరేణిలో భద్రతా ప్రమాణాల అమలులో ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. గనుల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు భద్రతా నిబంధనలను కచ్చితంగా పాటించాలని అన్నారు.
కార్మికుల సంక్షేమం, భద్రత కోసం సంస్థ చేపడుతున్న కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని తెలిపారు. ఏరియా జనరల్ మేనేజర్ బండి వెంకటయ్య మాట్లాడుతూ సేఫ్టీ విభాగంలో విశేష అనుభవం కలిగిన మల్లయ్య సేవలు రామగుండం రీజియన్‌కు లభించడం ఆనందదాయకమని పేర్కొన్నారు. ఆయన మార్గదర్శకత్వంలో ఆర్‌జి-2 ఏరియాలో గనుల భద్రతా ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌వోడీ (పర్సనల్) ఎన్. వేణుగోపాల్, ఏజీఎం (ఐఈ) కె. చంద్రశేఖర్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ బి.వి. సత్యనారాయణ, డీజీఎం (ఎఫ్ అండ్ ఏ) బి.వి. రామచంద్ర, పర్చేజ్ హెచ్‌వోడీ వి.జె. వెంకటేష్, ఎస్‌ఈ (సివిల్) పి. బాలరాజు, ఎన్విరాన్‌మెంట్ ఆఫీసర్ ఎన్. వేణుకుమార్, సీనియర్ ఎస్టేట్ ఆఫీసర్ సునీత, ఐటీ మేనేజర్ అశ్విని, మెడికల్ సూపరింటెండెంట్ జి.వి.డి. మహీపాల్, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ షరీఫ్ మహ్మద్, సీనియర్ అసిస్టెంట్ చిరాగ్ తదితరులు పాల్గొన్నారు.






