ఇంజన్ లోపం వల్ల కారు దగ్ధం..

by Kodari Anjali |

ఇంజన్ లోపం కారణంగా కారు దగ్ధం అయిన ఘటన సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం వట్టి ఖమ్మం పహాడ్ గ్రామ శివారులో జరిగింది.

ఇంజన్ లోపం వల్ల కారు దగ్ధం..
X

దిశ, చివ్వేంల: సూర్యాపేట జిల్లా చివ్వేంల మండలం వట్టి ఖమ్మం పహాడ్ గ్రామ శివారులో ఇంజన్ లోపం కారణంగా కారు దగ్ధం అయిన సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా సుబ్బి లేడు గ్రామానికి చెందిన బత్తుల వెంకటనారాయణకు చెందిన డస్టర్ కారులో ఇంజన్‌‌‌లో లోపం కారణంగా కారు పూర్తిగా కాలి బూడిద అయ్యింది. ఈ ప్రమాదంలో కారులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సంఘటన స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంఘటనలో పెను ప్రమాదం తప్పడంతో స్థానికులు, వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు.

Next Story