- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > హైదరాబాద్ > రేణుక ఎల్లమ్మ తల్లి మహాద్వారం (కమాన్) నూతన నిర్మాణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే
రేణుక ఎల్లమ్మ తల్లి మహాద్వారం (కమాన్) నూతన నిర్మాణ పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే
by Kodari Anjali |
యాదగిరి నగర్‌లో ఉన్న నూతనంగా నిర్మించనున్న రేణుక ఎల్లమ్మ తల్లి మహాద్వారం (కమాన్) నూతన నిర్మాణ పనుల్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

X
దిశ, జూబ్లీహిల్స్: యూసఫ్‌గూడ డివిజన్‌లోని యాదగిరి నగర్‌లో ఉన్న నూతనంగా నిర్మించనున్న శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి మహాద్వారం (కమాన్) నూతన నిర్మాణ పనులకు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి.నవీన్ యాదవ్ ,బీసీ జేఏసీ చైర్మన్ వి.చిన్న శ్రీశైలం యాదవ్ తో కలిసి కొబ్బరికాయ కొట్టి భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. భక్తుల మనోభీష్టాలను నెరవేర్చే రేణుక ఎల్లమ్మ తల్లి కృపాకటాక్షాలు యాదగిరి నగర్ , నియోజకవర్గ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఎమ్మెల్యే గారు ప్రార్థించారు. ఆలయ అభివృద్ధి, ఆధ్యాత్మిక వాతావరణ పరిరక్షణకు తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు.బస్తీలో నెలకొన్న ఏ సమస్య అయినా తన దృష్టికి తీసుకురావాలని స్థానిక ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానికులు పార్టీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
Next Story






