ప్రేమ, పెళ్లి ముచ్చట తరవాత చూద్దాం.. జెన్ జీ‌లో మరో కొత్త డేటింగ్ కల్చర్

by Ajay Maddhiboyina |

ఒక‌ప్పుడు యువ‌తి, యువకుడి మ‌ధ్య రిలేష‌న్‌షిప్ ఉందంటే దాన్ని ప్రేమ అని పిలిచేవాళ్లు. ఇద్దరూ ప్రేమించుకున్నారు కాబట్టి తరవాత పెళ్లి చేసుకుంటారని భావించేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ముఖ్యంగా జెన్ జీ రిలేషన్ షిప్స్‌లో రోజుకో కాన్సెప్ట్ పుట్టుకుని వస్తోంది.

ప్రేమ, పెళ్లి ముచ్చట తరవాత చూద్దాం.. జెన్ జీ‌లో మరో కొత్త డేటింగ్ కల్చర్
X

దిశ, వెబ్ డెస్క్: ఒక‌ప్పుడు యువ‌తి, యువకుడి మ‌ధ్య రిలేష‌న్‌షిప్ ఉందంటే దాన్ని ప్రేమ అని పిలిచేవాళ్లు. ఇద్దరూ ప్రేమించుకున్నారు కాబట్టి తరవాత పెళ్లి చేసుకుంటారని భావించేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ముఖ్యంగా జెన్ జీ రిలేషన్ షిప్స్‌లో రోజుకో కాన్సెప్ట్ పుట్టుకుని వస్తోంది. ఇప్పటికే సిచ్యువేషన్‌షిప్, బెంచింగ్, ట్రూ రిలేషన్‌షిప్, కమిటెడ్ పార్ట్‌నర్‌షిప్ లాంటివి ఉండగా ఇప్పుడు మేబీ‌లేటర్‌షిప్ అనే కొత్త కాన్సెప్ట్ తెరపైకి వచ్చింది. పైన చెప్పుకున్న బంధాల్లో ప్రతిదానిలో ముందుగానే ఒక క్లారిటీ ఉంటే అసలు ఎలాంటి క్లారిటీ లేకుండా ఇద్దరూ కలిసి ఉండటమే మేబిలేటర్‌షిప్.

దీని అర్థం "తరవాత చూద్దాం".. ఇక్కడ భవిష్యత్ లో తమ బంధం ఎలా ముందుకు సాగాలి.. పెళ్లి చేసుకోవాలా.. కొద్దిరోజులు టైమ్ పాస్ చేసి విడిపోవాలా అనే క్లారిటీ అసలు ఉండదు. ఇక్కడ భవిష్యత్ గురించి చర్చ వచ్చినప్పుడల్లా తరవాత చూద్దాం... అని పార్ట్‌నర్స్ దాటవేస్తుంటారు. ప్రస్తుతం డేటింగ్ కల్చర్ పెరగటంతో డేటింగ్ యాప్స్, సోషల్ మీడియా ద్వారా సులభంగా ఒకరికొకరు దగ్గరవుతున్నారు. అంతేకాకుండా చాలా మంది మేబీలేటర్ షిప్‌నే ఇష్టపడుతున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ ఎవరి కెరీర్ వాళ్లు చూసుకుంటూ, బంధంపై పూర్తిగా నమ్మకం పెట్టుకోరు కానీ తమ పార్ట్ నర్ సహవాసాన్ని మాత్రం ఆస్వాదిస్తారు.

మేబీలేటర్ షిప్‌లో ఉన్నారని చెప్పే కొన్ని సంకేతాలు

ఈ రిలేషన్ షిప్‌లో ఉన్నవాళ్లు ప్రతిరోజు మాట్లాడుకుండా, కలిసి సమయాన్ని గడుపుతారు. అంతేకాకుండా వ్యక్తిగత విషయాలు కూడా పంచుకుంటారు. ఇద్దరి మధ్య ఎమోషనల్ బాండింగ్ ఉన్నప్పటికీ, తరవాత ఏంటి అనేదానిపై ఎప్పుడు సందిగ్ధంలోనే ఉంటారు. రిలేషన్ షిప్ కంటే తమ భవిష్యత్ ఎక్కువ ముఖ్యం అని భావిస్తుంటారు. ఈ రిలేషన్ షిప్ లో ఎంతకాలం కలిసి ఉంటారు అనేదానిపై కూడా గ్యారెంటీ ఉండదు. ఇక్కడ ఇద్దరూ నిజంగా ఒకరినొకరు ఇష్టపడినప్పటికీ లాంగ్ రిలేషన్ షిప్ లోకి వెళ్లాలంటే అనుమానం, భయంతో ఆగిపోతారు. ఇలాంటి రిలేషన్ షిప్ లో ఉన్న సమయంలో ఒకరు లైట్ తీసుకుని, మరొకరు సీరియస్ గా తీసుకునే అవకాశం కూడా ఉంది. దానివల్ల సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఇద్దరూ ఓపెన్ గా మాట్లాడుకుని ముందుగానే సరైన నిర్ణయాలు తీసుకోవాలి.

Next Story