- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోడీ ప్రశాంతంగా కనిపించే తిరుగులేని యోధుడు.. ట్రంప్ ప్రశంసలు
జీ 7 దేశాల నాయకుల సమావేశం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని మోడీపై ప్రశంలు కురిపించారు. మోడీ చాలా ప్రశాంతమైన వ్యక్తి, తిరుగులేని యోధుడు కానీ నేను అలా కాదు అంటూ ట్రంప్ ప్రపంచ నాయకులకు మోడీని చూపిస్తూ మాట్లాడారు.

దిశ, వెబ్ డెస్క్: జీ 7 దేశాల నాయకుల సమావేశం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రధాని మోడీపై ప్రశంలు కురిపించారు. మోడీ చాలా ప్రశాంతమైన వ్యక్తి, తిరుగులేని యోధుడు కానీ నేను అలా కాదు అంటూ ట్రంప్ ప్రపంచ నాయకులకు మోడీని చూపిస్తూ మాట్లాడారు. మోడీ ధైర్యంగా ఉంటారని చెప్పారు. అయితే ట్రంప్ మోడీపై ప్రశంసలు కురిపించడం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ చాలాసార్ల మోడీని ప్రశ్నించారు. 2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు సైతం ట్రంప్ మోడీపై పొగడ్తలు కురిపించారు. మోడీ నాకు మంచి స్నేహితుడు, మంచి మనిషి పైకి చూస్తే నాన్నలా కనిపిస్తాడని అన్నారు. అదే సమయంలో ఒక కిల్లర్ కూడా అంటూ ఆయన ధైర్యాన్ని కీర్తిస్తూ వ్యాఖ్యానించారు.
గతేడాది జరిగిన ఆసియా పసిఫిక్ ఎకనామిక్ కో ఆపరేషణ్ సదస్సులోనూ ట్రంప్ మోడీ నాయకత్వశైలిని ప్రశంసించారు. ప్రధాని మోడీ చూడటానికి చాలా బాగుంటారు కానీ ఆయన అత్యంత కఠినమైన వ్యక్తి అని అన్నారు. పాకిస్థాన్ తో యుద్ధాన్ని ఆపేయాలని కోరినప్పుడు లేదు మేము ఫైట్ చేస్తాం అంటూ సమాధానం ఇచ్చారని, అప్పుడు తాను చూస్తున్నది మోడీనేనా అని అనుకున్నానని చెప్పారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం జరుగుతున్న జీ7 సమావేశాల్లో మోడీ, ట్రంప్ ల మధ్య గతంలో కనిపించిన అనుబంధం మాత్రం కనిపించలేదు. గతంలో వీరిద్దరూ ఎప్పుడూ కలుసుకున్నా ఆలింగనం చేసుకునేవాళ్లు. కానీ మంగళవారం జరిగిన సమావేశంలో షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. తరవాత కూడా ఇద్దరూ పెద్దగా పలకరించుకోలేదు. కానీ బుధవారం ట్రంప్ మోడీని ప్రశంసించడంతో పరిస్థితి సాధారంగానే అనిపించింది.






