- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బుధరావుపేటలో తుపాకీ కలకలం
బుధరావుపేట గ్రామంలో తుపాకీతో ఓ యువకుడు హల్‌చల్ చేయడం స్థానికంగా కలకలం రేపింది.

దిశ, ఖానాపురం: మండలంలోని బుధరావుపేట గ్రామంలో తుపాకీతో ఓ యువకుడు హల్‌చల్ చేయడం స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల సమాచారం ప్రకారం, గ్రామానికి చెందిన ఓ యువకుడు సోమవారం రాత్రి గ్రామంలోని బెల్ట్ షాపు వద్దకు మద్యం సేవించేందుకు వెళ్లాడు. ఈ సందర్భంగా బెల్ట్ షాపు నిర్వాహకుడితో పాటు అక్కడ ఉన్న పలువురు గ్రామస్తులతో అతడికి వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం తుపాకీ పట్టుకుని మళ్లీ బెల్ట్ షాపు నిర్వాహకుడితో పాటు అక్కడ ఉన్న వారిని బెదిరించాడు.
ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను పోలీసులకు పంపారు స్థానికులు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, అప్రమత్తమై మంగళవారం ఉదయం నుంచే యువకుడి కోసం ముమ్మర గాలింపు చేపట్టారు. వరంగల్, నర్సంపేట, ఖానాపురం ప్రాంతాలకు చెందిన పోలీసులు సంయుక్తంగా సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా గాలించారు. ఇక బుధవారం అతడు పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. అయితే ఘటనలో ఉపయోగించినది నిజమైన తుపాకీనా? లేక నకిలీదా? అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Tags
- Gun
- Budharavupeta






