- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శక్తివంతమైన సినిమాలు ఎందుకు చేయరని అడిగిన అభిమాని.. అదా శర్మ క్రేజీ పోస్ట్
మీరు మా ఫేవరెట్ నటి. మీ నటన ఎంతో సహజంగా, రియలిస్టిక్‌గా ఉంటుంది. మరి అలాంటప్పుడు మీరు మరాఠీ భాషలో ‘కార్ల్ స్టోరీ’, ‘1920’, ‘కొమ్డో’ లాంటి శక్తివంతమైన సినిమాలు ఎందుకు చేయకూడదు?" అని ప్రశ్నించారు.

దిశ, సినిమా: ‘ది కేరళ’ స్టోరీ సినిమాతో దేశవ్యాప్తంగా ఫుల్ ఫేమ్ రాబట్టుకుని సంచలనం సృష్టించిన అదా శర్మ.. రూట్ మార్చి వివాదాస్పద చిత్రాలతో తన పాపులారిటీని పెంచుకుంటున్నారు. ఇటీవల ‘గవర్నర్’ మూవీతో ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం సూపర్ వెల్లి, ది గేమ్ ఆఫ్ గిర్గిట్, హటక్ వంటి థ్రిల్లర్ సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, అదా శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో చిట్ చాట్ చేశారు. ఇందులో భాగంగా ఒక నెటిజన్ అదా శర్మను ఉద్దేశించి.. "మీరు మా ఫేవరెట్ నటి. మీ నటన ఎంతో సహజంగా, రియలిస్టిక్‌గా ఉంటుంది.
మరి అలాంటప్పుడు మీరు మరాఠీ భాషలో ‘కార్ల్ స్టోరీ’, ‘1920’, ‘కొమ్డో’ లాంటి శక్తివంతమైన సినిమాలు ఎందుకు చేయకూడదు?" అని ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు అదా శర్మ క్రేజీగా సమాధానమిస్తూ.. ఒక పెద్ద హింట్ ఇచ్చారు. జూన్ 18న ఉదయం 10 గంటలకు ఒక బిగ్ సర్‌ప్రైజ్ రాబోతోందంటూ పిల్లి ఎమోజీలతో పాటు నవ్వుతున్న ఎమోజీలను జత చేశారు. దాంతో ఆమె మరాఠీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టబోతోందని, రేపు రాబోయే అప్‌డేట్ అదేనని ఫ్యాన్స్ గట్టిగా ఫిక్స్ అయిపోతున్నారు. మరికొందరు మాత్రం ఆమె నటించే సినిమాలకు సంబంధించిన అప్డేట్ అయి ఉండొచ్చని అంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అదా శర్మ ఇవ్వబోయే ఆ సర్‌ప్రైజ్ ఏంటా అని నెటిజన్లు ఎంతో ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.






