- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సైబర్ నేరగాళ్లు ‘పరాన్నజీవులు’: సుప్రీంకోర్టు సెన్సేషనల్ కామెంట్స్
దేశంలోని సైబర్ నేరగాళ్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా విచ్చలవిడిగా జరుగుతున్న సైబర్ మోసాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సైబర్ నేరాలకు పాల్పడేవారు సమాజానికి పట్టిన పరాన్నజీవులు (Parasites) అని, అమాయక కష్టార్జితాన్ని దోచుకునే ఇలాంటి వారికి బెయిల్ ఇచ్చే ప్రసక్తే లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇవాళ ఓ భారీ సైబర్ ఫ్రాడ్ (Cyber Fraud) కేసుకు సంబంధించి నిందితుడు దాఖ చేసిన బెయిల్ పిటిషన్ ధర్మాసనం కొట్టివేసింది.
అమాయకుల సొమ్మును దోచేస్తున్నారు..
విచారణ సందర్భంగా జస్టిస్ బేలా ఎమ్.త్రివేది (Justice Bela M. Trivedi), జస్టిస్ పంకజ్ మిథాల్ (Justice Pankaj Mithal) ద్విసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సైబర్ నేరగాళ్లు దేశంలో పెరుగుతున్న డిజిటల్ ఆర్థిక వ్యవస్థను, అమాయక పౌరుల బ్యాంక్ ఖాతాలను టార్గెట్ చేస్తున్నారని మండిపడింది. కష్టపడి సంపాదించుకున్న ప్రజల సొమ్మును క్షణాల్లో మాయం చేస్తూ, సమాజంలో పరాన్నజీవుల్లా బతుకుతున్నారని నిలిదీసింది. అలాంటి ఆర్థిక నేరాలు దేశ ఆర్థిక భద్రతకు కూడా ముప్పుగా మారుతున్నాయని ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా వందలాది మందిని డిజిటల్ అరెస్టులు, పార్ట్-టైమ్ ఉద్యోగాల పేరుతో మోసగించి రూ.కోట్లు దోచుకున్న కేసులో ప్రధాన నిందితుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. దర్యాప్తు కీలక దశలో ఉన్నందున, ఇలాంటి వ్యవస్థీకృత సైబర్ నేరగాళ్లకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ రకమైన నేరాలను అణచివేసేందుకు కఠినమైన చర్యలు అవసరమని, సమాజ హితం కోసం నిందితుడికి జైలు శిక్షే సరైనదని అంటూ అతడి బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.






