మరణించినా మహోన్నతుడే..!

by Kodari Anjali |

రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఓ యువకుడు తన అవయవాల ద్వారా నలుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించాడు.

మరణించినా మహోన్నతుడే..!
X

దిశ, నేరేడుచర్ల (పాలకవీడు): రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఓ యువకుడు తన అవయవాల ద్వారా నలుగురికి కొత్త జీవితాన్ని ప్రసాదించి మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని జాన్‌పహాడ్ గ్రామానికి చెందిన మంద చైతన్య (35) ఈ నెల 12న జరిగిన ద్విచక్ర వాహన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, ఈ నెల 15న వైద్యులు ఆయనను బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. ఈ విషాద సమయంలోనూ చైతన్య కుటుంబ సభ్యులు గొప్ప మనసుతో అవయవదానానికి ముందుకొచ్చారు. వారి అంగీకారంతో వైద్యులు రెండు కిడ్నీలు, గుండె, కాలేయాన్ని సేకరించి అవసరమైన రోగులకు మార్పిడి చేసేందుకు చర్యలు చేపట్టారు. దీంతో నలుగురు వ్యక్తులకు కొత్త జీవితం లభించనుంది. కుమారుడిని కోల్పోయిన బాధలోనూ మరికొందరికి ప్రాణం పోయాలనే కుటుంబ సభ్యుల నిర్ణయాన్ని వైద్యులు, స్థానికులు ప్రశంసించారు. చైతన్య భౌతికంగా దూరమైనా, తన అవయవాల రూపంలో నలుగురిలో జీవిస్తాడని గ్రామస్తులు భావోద్వేగానికి గురయ్యారు.

Next Story