- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ ఎఫెక్ట్ : ‘ఎక్కడి చెత్త అక్కడే’ కథనానికి స్పందన
by Taduka Kalyani |
డోంగ్లి మండలం సిర్పూర్ గ్రామ పంచాయతీలో నెలకొన్న పారిశుధ్య సమస్యలపై ‘దిశ’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ‘

X
దిశ, డోంగ్లి (మద్నూర్): డోంగ్లి మండలం సిర్పూర్ గ్రామ పంచాయతీలో నెలకొన్న పారిశుధ్య సమస్యలపై ‘దిశ’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ‘ఎక్కడి చెత్త అక్కడే.. గ్రామంలో వెదజల్లుతున్న దుర్వాసన’ శీర్షికన ప్రచురితమైన వెబ్ లింక్ కథనంలో గ్రామంలో పేరుకుపోయిన చెత్త, పూడుకుపోయిన మురుగు కాలువల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెలుగులోకి తీసుకొచ్చింది. కథనంపై స్పందించిన డోంగ్లి మండల ఎంపీడీవో జగదీష్ అనిల్‌కుమార్ ఆదేశాల మేరకు సిర్పూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి పండరి ఆధ్వర్యంలో పారిశుధ్య పనులు ప్రారంభించారు. ప్రైవేట్ కార్మికులతో చెత్త తొలగింపు, మురుగు కాలువల శుభ్రపరిచే పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ‘దిశ’ కథనం వెలువడిన వెంటనే అధికారులు చర్యలు చేపట్టడంతో గ్రామ సమస్య పరిష్కార దిశగా అడుగులు పడటంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
Next Story






