- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మేమే రాజా అంటే కుదరదు.. ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్
కంటోన్మెంట్ అధికారుల తీరుపై ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: కంటోన్మెంట్ సీఈవో పనితీరుపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కంటోన్మెంట్‍కు కొత్తగా వచ్చిన సీఈవో పూర్తిగా నెగెటివ్ మైండ్‍తో ఉన్నారని ఏం చెప్పినా సరిగా స్పందించడం లేదన్నారు. ఇవాళ కంటోన్మెంట్ బోర్డు మీటింగులో పాల్గొన్న ఈటల ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కంటోన్మెంట్ భూముల అమ్మకం ద్వారా వచ్చిన 303 కోట్ల రూపాయలతో కంటోన్మెంట్లో సమగ్ర అభివృద్ధిని చేస్తున్నామని స్ట్రాం వాటర్ డ్రైన్, డ్రైనేజ్ సిస్టంలకు శాశ్వతంగా పరిష్కారం అందిస్తున్నామన్నారు. రాబోయే 40 ఏళ్లకు అనుగుణంగా డ్రైనేజ్ వ్యవస్థను సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. అనుభవమున్న, సమర్ధవంతమైన కాంట్రాక్టర్‍కు పని ఇవ్వాలని.. నిర్దేశిత సమయంలో పూర్తి అయ్యేలాగా చూడాలని కంటోన్మెంట్ అధికారులకు సూచించామన్నారు. గతంలో తప్పుడు రిపోర్టులతో షాపులను కూలగొట్టారు, వారికి తగిన న్యాయం చేయాలన్నారు.
మేమే రాజా అనే భావన మంచిది కాదు:
కంటోన్మెంట్ అభివృద్ధి కోసం రాకేష్ మిట్టల్‍ని కోరితే రూ.20 కోట్లు మంజూరు చేశారని మరో రూ.10 కోట్లు చేస్తామన్నారని ఈటల చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన స్టాంప్ డ్యూటీ పైసలు రూ.25 కోట్ల రూపాయలు కూడా అధికారులతో మాట్లాడి తెప్పించామని డబ్బులకు కొరత లేకున్నా పనులు చేయడంలో సీఈవో సుముఖంగా లేరన్నారు. కంటోన్మెంట్ అంటే మేమే రాజా అనే భావన మంచిది కాదన్నారు. ఒకనాడు కంటోన్మెంట్ ఆసుపత్రి బాగుండేది కానీ ఇప్పుడు నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. నిధులు తెచ్చే బాధ్యత మాది.. పనులు చేయండి తప్ప డబ్బులు లేవు అని ప్రజల అవసరాలను పక్కన పెట్టవద్దన్నారు.
కంచే చేను మేసినట్లు వ్యవహరిస్తున్నారు:
సర్వే నంబర్ 57/1, 157/1 రెండు గ్రామాల మధ్య వివాదం.. ప్రభుత్వ భూమిని ఉర్దూ పేపర్లో పుట్టించి వాటిని తర్జుమా చేసి ప్రైవేటు భూమిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. కాపాడాల్సిన ప్రభుత్వమే.. కంచే చేను మేసినట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. నాలుగు తరాలుగా ఉంటున్న భూములను ప్రైవేట్ పరం చేశారు. దానిని మరోసారి రివ్యూ చేయాలని కోరుతున్నానన్నారు. అధికారులు ప్రజలకు సేవకులు అని మరిచిపోయి పైరవీకారులకు కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. పేదలకు అండగా ఉంటామని వారి భూములు పోకుండా బాధ్యత తీసుకుంటామన్నారు. భూములలో లిటిగేషన్‍తో డాక్యుమెంట్లు సృష్టించుకుని అవినీతి అధికారులు వచ్చేంత వరకు వేచి చూసి.. దొంగ పేర్లతో రిజిస్ట్రేషన్ చేసుకుంటారు... ప్రభుత్వంతో రాజీపడి ఇలాంటి పనులు చేస్తారు. దీనిని సహించేది లేదన్నారు.






