రూ. 4.5 లక్షల గంజాయి పట్టివేత..

by Kodari Anjali |

వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా, ద్విచక్ర వాహనంపై గంజాయి తరలిస్తూ నిందితులు పట్టుబడ్డారు.

రూ. 4.5 లక్షల గంజాయి పట్టివేత..
X

దిశ, భద్రాచలం: భద్రాచలం పట్టణ ఎస్ ఐ పి.శ్యాం ప్రసాద్ సిబ్బందితో కలిసి కూనవరం రోడ్డులోని శ్రీ సుప్రియ పెట్రోల్ బంక్ సమీప ప్రాంతంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా, ద్విచక్ర వాహనం పై గంజాయి తరలిస్తూ నిందితులు పట్టుబడ్డారు. అనుమానాస్పదంగా వచ్చిన పల్సర్ మోటార్ సైకిల్‌ను ఆపేందుకు ప్రయత్నించగా, వాహనం వెనుక కూర్చున్న వ్యక్తి లగేజ్ బ్యాగ్‌తో దిగిన వెంటనే మోటార్ సైకిల్ నడుపుతున్న వ్యక్తి అక్కడి నుండి పరారయ్యాడు. పట్టుబడిన వ్యక్తి వద్ద ఉన్న లగేజ్ బ్యాగ్‌ను తనిఖీ చేయగా అందులో నాలుగు ప్యాకెట్లలో మొత్తం 8.580 కిలోల ఎండు గంజాయి ఉన్నట్లు గుర్తించారు.

కేసు నమోదు..

అరెస్టు చేసిన నిందితుడు పర్సిక నాగేశ్వరరావు, సుందరయ్య నగర్ కాలనీ, భద్రాచలం గా గుర్తించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.4.29 లక్షలు ఉంటుందని తెలిపారు . ఈ గంజాయిని ఒడిశా సరిహద్దు ప్రాంతం నుండి తీసుకొచ్చి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు . ఈ కేసులో ప్రధాన నిందితుడు మరియు కొనుగోలుదారు పరారీలో ఉండగా, వారి అరెస్టు కోసం ప్రత్యేక చర్యలు చేపట్టామని, పంచుల సమక్షంలో గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గంజాయు తరలిస్తూ పట్టుబడ్డ నిందితుడిని రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. మాదక ద్రవ్యాలు విక్రయస్తున్న, సేవిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తామని డి ఎస్ పి అరుణ్ కుమార్ అన్నారు.

Next Story