- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
157/1ప్రభుత్వ భూమిని ప్రైవేటుపరం చేసిందే బీఆర్ఎస్
సర్వే నెంబర్ 157/1లోని 8 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసిందే బీఆర్ఎస్ అని శ్రీగణేష్ అన్నారు.

దిశ, తిరుమలగిరి: సర్వే నెంబర్ 157/1లోని 8 ఎకరాల భూమిని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసిందే బీఆర్ఎస్ అని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ అన్నారు. కంటోన్మెంట్ బోర్డు సాధారణ సమావేశం బుధవారం బ్రిగేడియర్ రాజీవ్ అధ్యక్షతన బోర్డు కార్యాలయంలో జరిగిన సమావేశంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యేతో పాటు సిఈఓ అరవింద్ కుమార్ ద్వివేది, పలువురు అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీగణేష్ మీడియాతో మాట్లాడారు. కంటోన్మెంట్‌లోని విలువైన భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసిందే బీఆర్ఎస్ నాయకులని ఆరోపించారు. 2025జూలైలో సర్వే నెంబర్157/1లోని 8 ఎకరాల భూమిలో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని రెవెన్యూ,గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తాను వినతి పత్రం అందజేశానని తెలిపారు.
2023 జూన్‌లోనే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడి, స్వయంగా కేటీఆర్ డీల్ చేసి.. ఆ భూమిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని కంటోన్మెంట్ ప్రాంతంలోని ప్రతి ఒక్కరికీ తెలుసని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు అవినీతికి పాల్పడకుండా ఉంటే ఈ పరిస్థితి దాపురించేది కాదని అన్నారు. కంటోన్మెంట్ బోర్డుకు సమకూరిన 303 కోట్లతో భవిష్యత్ తరాలకు ఇబ్బంది లేకుండా నాలాలు,డ్రైనేజీ వ్యవస్థలను ఆధునీకరించాలని బోర్డు సమావేశంలో అధికారులకు సూచించినట్లు తెలిపారు.నిరుపయోగంగా ఉన్న టాయిలెట్లను కూల్చివేసి,7వ వార్డు వనిత ఎన్‌క్లేవ్ తరహాలో పార్కులు,మహిళా భవన్‌లు,క్రీడా ప్రాంగణాలుగా అభివృద్ధి చేస్తే పిల్లలు,యువత,పెద్దల ఆరోగ్యానికి,వాకింగ్‌కు ఎంతో ఉపయోగమని తెలిపారు.






