- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజా గుండెల్లో చిరస్థాయిగా నిలిచే లీడర్ నరేష్ రెడ్డి
by velandi.Saikiran |
బుధవారం ఆయన నూకల నరేష్ రెడ్డి జయంతి సందర్భంగా మండలంలోని ఏరువాక తోటలో నూకల విగ్రహానికి కాంగ్రెస్ యువ నాయకుడు, నూకల తనయుడు అభినవ్ రెడ్డితో కలిసి నివాళులర్పించారు.

X
దిశ, మరిపెడ: డోర్నకల్ నియోజవకర్గ ప్రజలకు దివంగత నూకల నరేష్ రెడ్డి అందించిన సేవలు ఎనలేనివని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోతు రాంచంద్రునాయక్ పేర్కొన్నారు. సుమారు 40ఏళ్ల పాటు ఏ పదవీ లేకున్నా కష్ట కాలంలో ప్రజలకు చేదోడు వాదోడుగా నిలిచిన లీడర్ నూకల అని అన్నారు. బుధవారం ఆయన నూకల నరేష్ రెడ్డి జయంతి సందర్భంగా మండలంలోని ఏరువాక తోటలో నూకల విగ్రహానికి కాంగ్రెస్ యువ నాయకుడు, నూకల తనయుడు అభినవ్ రెడ్డితో కలిసి నివాళులర్పించారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు పెండ్లి రఘువీరా రెడ్డి, మునిసిపల్ చైర్మెన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి, మాజీ సర్పంచ్ పాంగోత్ రాంలాల్, జిల్లా మైనారిటీ నాయకులు అఫ్జల్ ఉన్నారు.
Next Story






