- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య
మండలంలోని నాగ్లూర్ గ్రామానికి చెందిన బాల గొల్ల సుధాకర్ రావు అనే వ్యక్తి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ ఐ. మహేందర్ తెలిపారు.

దిశ, గాంధారి : మండలంలోని నాగ్లూర్ గ్రామానికి చెందిన బాల గొల్ల సుధాకర్ రావు అనే వ్యక్తి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ ఐ. మహేందర్ తెలిపారు. మృతుడు సుధాకర్ రావు, అతని భార్య నికిత బాయిలు ఈనెల 15వ తేదీన పంట చేనుకు వెళ్లినట్లు తెలిపారు. అక్కడనుండి సుధాకర్ రావు అటవీ ప్రాంతంలోకి వెళ్లి రాత్రి అయిన ఇంటికి తిరిగి రాకపోవడంతో కంగారుపడిన ఆమె చుట్టుపక్కల వారితో పాటు బంధువులకు సైతం తన భర్త విషయంలో వాకబు చేసినట్లు వివరించారు. అయినా ఫలితం లేక పోయినట్లు వివరించారు. కాగా బుధవారం నాగులూర్ గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు విచారణ చేయడంతో మృతుడు సుధాకర్ రావు అని తేలడంతో కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన వివరించారు. మృతదేహం కుళ్లిపోయి ఉండడంతో అక్కడే పోస్టుమార్టం నిర్వహించినట్లు వివరించారు. కాగా మృతునికి గత కొన్ని రోజుల నుండి మతిస్థిమితం సరిగా లేకపోవడంతో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య కు పాల్పడినట్లు గ్రామస్తులు వివరించారు. ఈ విషయమై మృతుని భార్య నికితబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్ తెలిపారు.






