- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటర్ల జాబితా సవరణలో బీఎల్ఏల పాత్ర కీలకం: ఎమ్మెల్యే అహ్మద్ బలాల
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) కీలక పాత్ర పోషించాలని మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల పేర్కొన్నారు.

దిశ, చంపాపేట్: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) కీలక పాత్ర పోషించాలని మలక్‌పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల పేర్కొన్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంపై బీఎల్ఏలకు అవగాహన కల్పించేందుకు చాదర్‌ఘాట్‌లోని ఇంపీరియల్ గార్డెన్‌లో నిర్వహించిన ప్రత్యేక సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం ప్రజాస్వామ్య బలోపేతానికి అత్యంత కీలకమని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హుడి పేరు ఓటర్ల జాబితాలో నమోదు అయ్యేలా బీఎల్ఏలు క్షేత్రస్థాయిలో పని చేయాలని సూచించారు. అదే సమయంలో డబుల్ ఎంట్రీలు, మరణించిన వ్యక్తుల పేర్లు, వలస వెళ్లిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. ఓటు హక్కు ప్రతి పౌరుడికి లభించే రాజ్యాంగబద్ధమైన హక్కు అని, అర్హులైన వారికి ఓటు హక్కు అందేలా, అనర్హుల పేర్లు తొలగించేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిజాయితీతో విధులు నిర్వర్తించి, ఓటర్ల నమోదు ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని బీఎల్ఏలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన బూత్ లెవల్ ఏజెంట్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






