తిమ్మాపూర్ లో రోడ్డు ప్రమాదం

by velandi.Saikiran |

తిమ్మాపూర్ మండల కేంద్రంలోని రాజీవ్ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

తిమ్మాపూర్ లో రోడ్డు ప్రమాదం
X

దిశ, తిమ్మాపూర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని రాజీవ్ రహదారిపై బుధవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. తిమ్మాపూర్ రాజీవ్ రహదారిపై వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వెళ్తున్న మహిళతో పాటు మరొకరికి గాయలయ్యాయి. కాగా అదే సమయంలో అటుగా వెళ్తున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన వాహనాన్ని ఆపి, క్షతగాత్రులను పోలీస్ వాహనంలో ఆసుపత్రికి పంపించారు.

Next Story