మూడున్నరేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన కోచ్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష

by Kodari Anjali |

మూడున్నరేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన పాఠశాల కోచ్, అతనికి సహకరించిన ప్రిన్సిపాల్‌కు కఠిన కారగార శిక్ష విధించింది.

మూడున్నరేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన కోచ్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష
X

దిశ, శేరిలింగంపల్లి: మూడున్నరేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన పాఠశాల కోచ్, అతనికి సహకరించిన ప్రిన్సిపాల్‌కు కఠిన కారాగార శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ జిమ్నాస్టిక్ కోచ్‌గా ఉన్న కురా కిరణ్ సాయి (31) చిలకముక్కు దీపిక (37)ప్రైవేట్ పాఠశాలలో ప్రిన్సిపాల్‌గా పని చేస్తున్నారు. స్వస్థలం నారాయణఖేడ్. ఇరువురిని దోషులుగా నిర్ధారించిన న్యాయస్థానం కిరణ్‌కు 20 ఏళ్లు తగ్గని కఠిన కారాగార శిక్ష రూ. 20,000 జరిమానా, దీపికకు 3 ఏళ్ల సాధారణ కారాగార శిక్ష రూ. 1,000 జరిమానా విధించారు. మియాపూర్‌లో ఓ ప్రైవేట్ ప్రీ-స్కూల్‌కు చదువుకునేందుకు వెళ్లిన మూడున్నర ఏళ్ల చిన్నారి అసాధారణ ప్రవర్తనతో పాటు జననేంద్రియ ప్రాంతంలో నొప్పి వస్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పింది. వెంటనే చిన్నారి తల్లిదండ్రులు మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

పాఠశాల ప్రిన్సిపల్ పైన కేసు నమోదు..

ఈ ఘటన 2019 జూన్ 20 న జరగ్గా అప్పట్లో మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. పాఠశాల వ్యాన్ ఆలస్యంగా రావడంలో కిరణ్ ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని బాలికను పాఠశాలపై అంతస్తులోని జిమ్నాస్టిక్ గదికి తీసుకెళ్లాడు. అక్కడ ఎవరూ లేని సమయంలో, గది మూలకు తీసుకెళ్లి ఆమె జననేంద్రియ భాగంలో తన వేలిని చొప్పించాడు. దాంతో ఆమె ఏడ్చింది. వెంటనే కిరణ్ ఆమెను గ్రౌండ్ ఫ్లోర్‌ వద్ద వదిలి పారిపోయాడు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాఠశాల ప్రిన్సిపల్ పైన కేసు నమోదయింది. పూర్తి స్థాయి విచారణ అనంతరం, రాజేంద్రనగర్‌లోని రంగారెడ్డి జిల్లాకు చెందిన అత్యాచారం కేసుల విచారణ, పరిష్కార ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి టి. శ్రీనివాస్ నిందితులను దోషులుగా నిర్ధారించి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. బాధితురాలికి మూడు లక్షల పరిహారం మంజూరు చేశారు.

Next Story