త్వరలోనే పరిష్కారం: మంత్రి అజారుద్దీన్ గుడ్ న్యూస్

by Vemula.Srinu Prasad |

కొంతకాలంగా వాయిదాపడ్డ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం తిరిగి బుధవారం గాంధీభవన్ లో ప్రారంభమైంది. మంత్రి అజారుద్దీన్ ఈ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు...

త్వరలోనే పరిష్కారం: మంత్రి అజారుద్దీన్ గుడ్ న్యూస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కొంతకాలంగా వాయిదాపడ్డ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం తిరిగి బుధవారం గాంధీభవన్ లో ప్రారంభమైంది. మంత్రి అజారుద్దీన్ ఈ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రికి తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వందలాది మంది ప్రజలు హాజరై తమ సమస్యలు, వినతిపత్రాలు, అభ్యర్థనలను సమర్పించారు. భారీగా ప్రజలు తరలివచ్చిన నేపథ్యంలో, పలువురు ఓర్పుతో వేచి ఉండి తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అజారుద్దీన్ స్వయంగా ప్రజలను కలుసుకుని వారి సమస్యలను శ్రద్ధగా విన్నారు. కార్యక్రమంలో సమర్పించిన ప్రతి వినతిపత్రాన్ని పరిశీలించారు. ప్రజలు ఇచ్చిన వినతిపత్రాలపైన జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ అధికారులు, ఎస్పీలు, ఎంఆర్వోలు మరియు సంబంధిత శాఖల అధికారులతో నేరుగా ఫోన్‌లో మాట్లాడి పెండింగ్ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సంక్షేమ పథకాలు, విద్య, పింఛన్లు, రెవెన్యూ సమస్యలు, భూ వివాదాలు, గృహాలు మరియు ఇతర పౌర సమస్యలకు సంబంధించిన అంశాలను ప్రజలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా మంత్రి అజారుద్దీన్ మీడియాతో మాట్లాడుతూ వివిధ సమస్యలతో ప్రజలు వచ్చారని, సుమారు 200 పైగా అప్లికేషన్స్ వచ్చాయన్నారు. తనకు సాధ్యమైనంత వరకు వచ్చిన పిటిషన్ పై అక్కడే అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేశానని, 50 పిటిషల సమస్యలకు వెంటనే కలెక్టర్‌తో మాట్లాడి పరిష్కరించినట్లుగా అజారుద్దీన్ తెలిపారు. తెలంగాణ అభివృద్ధి కోసం సీఎం ఎంతో కష్టపడి పని చేస్తున్నారని, టీపీసీసీ చీఫ్ ప్రజలతో ముఖాముఖీ అనే మంచి కార్యక్రమం పెట్టారన్నారు. ప్రతిపక్షంలో ఉన్నందున ఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని, ఆధారాలు లేకుండనే, టెండర్ లో స్కామ్ అంటూ మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. పబ్లిక్ ని డైవర్ట్ చేయడానికే బీఆర్ఎస్ నేతలు ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని, ఫీజు రీఎంబర్స్మెంట్ పాపం గత ప్రభుత్వానిదని అజారుద్దీన్ ఆరోపించారు.

Next Story