ప్రోఫీ కావాలా మామ..! ఫిట్‌నెస్ కేంద్రాల్లో కొత్త ట్రెండ్!

by Javid Pasha |

ప్రొటీన్ కాఫీ అంటే కాఫీతో ప్రొటీన్ మూలాలను కలిపి తయారు చేయడం. జిమ్‌కు వెళ్లేవాళ్లు.. బిజీగా ఉండేవాళ్లకు ఇది సౌకర్యవంతమైన ఎంపికగా మారింది.

ప్రోఫీ కావాలా మామ..! ఫిట్‌నెస్ కేంద్రాల్లో కొత్త ట్రెండ్!
X

దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియా, ఫిట్‌నెస్ వర్గాలు.. జిమ్‌లు.. కేఫ్‌లలో ఇప్పుడు వినిపిస్తున్న ఒకే మాట ప్రోఫీ. కాఫీలో ప్రొటీన్ కలిపి తయారు చేసే పానీయం అన్నమాట. ఇది ప్రొటీన్ షేక్‌లు.. ఘీ కాఫీలను వెనక్కి నెట్టి కొత్త ట్రెండ్‌గా మారింది.

ప్రోఫీ అంటే.?

ప్రొటీన్ కాఫీ అంటే కాఫీతో ప్రొటీన్ మూలాలను కలిపి తయారు చేయడం. ఉదయం కాఫీ తాగేవాళ్లు.. జిమ్‌కు వెళ్లేవాళ్లు.. బిజీగా ఉండేవాళ్లకు ఇది సౌకర్యవంతమైన ఎంపికగా మారింది. విడివిడిగా కాఫీ.. ప్రొటీన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఒకేసారి రెండూ లభిస్తాయి. కాఫీ.. ప్రొటీన్ రెండూ ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. మితంగా కాఫీ తాగడం వల్ల టైప్-2 డయాబెటిస్.. గుండె సంబంధిత సమస్యలు తగ్గే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రొటీన్ కండరాలు బలపడటం.. రోగనిరోధక శక్తి పెరగటం.. ఆకలి నియంత్రణలో సహాయపడుతుంది.

అంత ఆసక్తి ఎందుకు?

ప్రొఫీ ట్రెండ్ వెనక ప్రధాన కారణం సౌకర్యం. ఉదయం తొందరలో ఉన్నవాళ్లు ఒక్క కప్పులో కాఫీ.. ప్రొటీన్ పొందవచ్చు. ఇది ఎక్కువసేపు కడుపు నింపి ఉంచుతుంది. రోజువారీ ప్రొటీన్ అవసరాన్ని తీర్చడానికి.. కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్స్ పొందడానికి ఇది ఉపయోగపడుతుంది. జిమ్‌లకు వెళ్లేవారు.. బిజీ ప్రొఫెషనల్స్.. వయసు పెరిగినవాళ్లు.. ఎక్కువసేపు ఆకలి అనిపించకుండా ఉండాలనుకునేవాళ్లందరూ ఇప్పుడు ప్రొఫీనే ఇష్టపడుతున్నారు. అయితే ఇది అన్ని సమస్యలకూ మందు కాదు. ప్రొఫీని బ్యాలెన్స్‌డ్ డైట్‌లో భాగంగా తీసుకుంటే మంచిది. ఇది మాత్రమే తాగి భోజనం మానేయకూడదు.

ఎవరు జాగ్రత్త పడాలి?

ప్రోఫీ అందరికీ పడదు. కాఫీని ఎక్కువగా తట్టుకోలేని వాళ్లు.. ఆందోళన.. నిద్ర సమస్యలు ఉన్నవాళ్లు.. గుండె సంబంధిత సమస్యలు ఉన్నవాళ్లు.. కిడ్నీ వ్యాధి ఉన్నవాళ్లు డాక్టర్ లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకున్నాకే ప్రోఫీని తాగాలి. ప్రోఫీని కేవలం సౌకర్యం కోసం ఉపయోగించాలే తప్ప రోజంతా ఇదే తాగి పోషకాలు తక్కువ అయ్యేలా చేసుకోకూడదు. దీన్ని సమతుల్య ఆహారంలో భాగంగా చేర్చుకోవడమే ఉత్తమం. ప్రోఫీ ట్రెండ్ సరదాగా.. సౌకర్యంగా ఉంది. కానీ ఆరోగ్యం కోసం దీర్ఘకాలిక బ్యాలెన్స్‌డ్ డైట్‌నే అనుసరించాలని నిపుణులు గుర్తు చేస్తున్నారు.

Next Story