- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘గట్టకుస్తీ-2’ నాకు చాలా స్పెషల్.. ఆ 5 నిమిషాల సీన్‌కు అందరూ కనెక్ట్ అవుతారు: విష్ణు విశాల్
మొదటి భాగంలో భర్తపై జోకులు, భార్య గొప్పతనం చూపించామని.. కానీ ఈ రెండో భాగంలో కథ మొత్తం భర్త చుట్టూ తిరుగుతుందని చెప్పారు.

దిశ, సినిమా: కోలీవుడ్ హీరో విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన సూపర్ హిట్ స్పోర్ట్స్ కామెడీ చిత్రం ‘గట్ట కుస్తీ’ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఇప్పుడీ క్రేజీ సినిమాకు సీక్వెల్ ‘గట్ట కుస్తీ 2’ రాబోతోంది. దర్శకుడు చెల్లా అయ్యావు తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మొదటి భాగంలో నటించిన కరుణాస్, కాళీ వెంకట్, మునిష్కాంత్, గజరాజ్‌లతో పాటు కరుణాకరన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. శాన్ రోల్డాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం, రోజువారీ కుటుంబ సమస్యలను ఎంతో వినోదాత్మకంగా చూపించబోతోంది. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూలై 3న థియేటర్స్‌లో విడుదల చేయాలని మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈనేపథ్యంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణు విశాల్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మొదటి భాగంలో భర్తపై జోకులు, భార్య గొప్పతనం చూపించామని.. కానీ ఈ రెండో భాగంలో కథ మొత్తం భర్త చుట్టూ తిరుగుతుందని చెప్పారు.
తాను సమానత్వాన్ని నమ్ముతానని, అందుకే ఈసారి మగాడి కోణంలో భార్యాభర్తల బంధాన్ని చూపించబోతున్నట్లు తెలిపారు. డబ్బు ఉన్న చోట అధికారం ఉంటుంది, అది మగవారికైనా, ఆడవారికైనా వర్తిస్తుంది. అయితే ఇందులో ఆ అధికారం బాధ్యత నుండి వస్తుంది కానీ, దుర్వినియోగం చేయడానికి కాదని ఆయన వివరించారు. మొదటి భాగంలో ఇంటర్వెల్ సీన్‌ను ప్రేక్షకులు ఎంతగా ఎంజాయ్ చేశారో.. ఈ సీక్వెల్‌ను కూడా అంతే ఇష్టపడతారని అన్నారు. సినిమాలో తాను కూడా కుస్తీ ఫైట్స్ చేస్తానని తెలిపారు. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో మహిళల కోసం ఒక 5 నిమిషాల ఎమోషనల్ సీన్ ఉంటుందని, దానికి అందరూ కనెక్ట్ అవుతారని.. అలాగే తన భార్య ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలని ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. ‘గట్ట కుస్తీ 2’ 25వ సినిమాగా రాబోతుందని చాలా స్పెషల్‌గా ఉండబోతోందని పేర్కొన్నారు. ఈ సీక్వెల్‌లో విష్ణు విశాల్ ఇంటి పనులు చూసుకునే భర్త పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.






