- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బస్సులో వృద్ధురాలి బంగారు గుండ్లు అపహరణ
by Taduka Kalyani |
నిజామాబాద్ జిల్లాలోని నవీపేట్ మండల కేంద్రంలో బస్సులో ప్రయాణిస్తున్న ఓ వృద్ధురాలి మెడలోని రెండు తులాల బంగారు గుండ్లు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు.

X
దిశ, నవీపేట్: నిజామాబాద్ జిల్లాలోని నవీపేట్ మండల కేంద్రంలో బస్సులో ప్రయాణిస్తున్న ఓ వృద్ధురాలి మెడలోని రెండు తులాల బంగారు గుండ్లు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. నిజామాబాద్ నగరంలోని కోటగల్లికి చెందిన విజయ అనే మహిళ నవీపేట్ లోని తన కూతురు ఇంటికి వచ్చి తిరిగి వెళ్ళే క్రమంలో నవీపేట్ వద్ద నిజామాబాద్‌కు వెళ్లే ఆర్టీసీ బస్సు ఎక్కే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సు ఎక్కుతున్న సమయంలో ఆమె మెడలో ఉన్న రెండు తులాల బంగారు గుండ్లను దుండగులు అపహరించారు విషయం తెలుసుకున్న బాధితురాలు ప్రయాణికులకు తెలుపడంతో పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని బస్సులోని ప్రయాణికులను తనిఖీలు చేశారు.
Next Story






