- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూమి విక్రయం.. ఐదుగురు కేటుగాళ్ల అరెస్ట్
నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వ భూమిని విక్రయించడమే కాకుండా, బాధితుల నుంచి రూ. 47.87 లక్షలు వసూలు చేసిన ముఠాను సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, కొండపాక: నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వ భూమిని విక్రయించడమే కాకుండా, బాధితుల నుంచి రూ. 47.87 లక్షలు వసూలు చేసిన ముఠాను సిద్దిపేట త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్స్పెక్టర్ టి. లక్ష్మీబాబు తెలిపిన వివరాల ప్రకారం...కొండపాక మండలం దుద్దెడ గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిని (సర్వే నం. 655/1) తమ సొంత భూమిగా చూపిస్తూ జక్కుల రాజు, హరీందర్ దేవాసి, గుండెల్లి ఆంజనేయులు, సోలంకి థానారం, బూరుగుల వెంకటరమణ అనే ఐదుగురు నిందితులు నకిలీ డాక్యుమెంట్లు, పాస్‌బుక్‌లు సృష్టించారు. 2020లో ఈ భూమిని ఎడ్ల జ్యోతి, శ్రీనివాస్ రెడ్డి దంపతులకు రూ. 7.87 లక్షలకు విక్రయించారు. ఆ తర్వాత భూమి వివాదం పరిష్కారం పేరుతో మరో రూ. 40 లక్షలు నొక్కేశారు.2022లో రెవెన్యూ అధికారుల సర్వేలో అది ప్రభుత్వ భూమిగా తేలడంతో మోసం బయటపడింది. నిందితులు బాధితులను బెదిరించడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి కీలక ఆధారాలు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. భూములు కొనేముందు ధరణి రికార్డులు, సర్వే మ్యాపులను పూర్తిగా పరిశీలించాలని పోలీసులు ప్రజలకు సూచించారు.






