17 రోజులుగా చంచల్‌గూడ జైలులోనే.. హైకోర్టును ఆశ్రయించిన బాల్క సుమన్

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-17 13:15:14  IST  )

చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

17 రోజులుగా చంచల్‌గూడ జైలులోనే.. హైకోర్టును ఆశ్రయించిన బాల్క సుమన్
X

దిశ, వెబ్‌డెస్క్: విద్వేషపూరిత ప్రసంగాలు (Hate Speech) చేశారనే ఆరోపణలపై నమోదైన కేసులో అరెస్ట్ అయిన బీఆర్‌ఎస్ (BRS) నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) బెయిల్ కోసం ఇవాళ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. కింది కోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురికావడంతో న్యాయ సహాయం కోసం ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో అత్యవసర బెయిల్ పిటిషన్‌ను దాఖలు చేశారు.

అయితే, మే 30న బాల్క సుమన్‌ను బంజారాహిల్స్ పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నాటి నుంచి ఆయన హైదరాబాద్‌లోని చంచల్‌గూడ (Chanchalguda) కేంద్ర జైలులోనే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బాల్క సుమన్ ఇప్పటికే 17 రోజులుగా జైలులోనే ఉన్నారని, దర్యాప్తుకు ఆయన పూర్తిగా సహకరిస్తున్నారని ఆయన తరఫు లాయర్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆయనకు రాజకీయంగా ఉన్న ప్రతిష్టను దెబ్బతీయడానికే ఈ కేసు పెట్టారని, తక్షణమే బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. కాగా, బాల్క సుమన్ దాఖలు చేసిన లీగల్ బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు పరిశీలనకు స్వీకరించింది. దీనిపై ఒకటి రెండు రోజుల్లోనే హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

Next Story