- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెట్ పల్లి టౌన్ ప్లానింగ్ అధికారి సస్పెండ్
మెట్ పల్లి టౌన్ ప్లానింగ్ అధికారి(టిపిఓ)రాజేంద్ర ప్రసాద్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

దిశ, మెట్ పల్లి: జగిత్యాల జిల్లా మెట్ పల్లి టౌన్ ప్లానింగ్ అధికారి(టిపిఓ)రాజేంద్ర ప్రసాద్ ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మెట్ పల్లి పట్టణనానికి చెందిన జగ్గుల లావణ్య అనే మహిళ పట్టణంలోని ఇంటి పనుల నిర్మాణానికి పరిమిషన్ తీస్కొని ఇంటి నిర్మాణ పనులు చేయించుకుంటోంది. ఈ క్రమంలో టిపిఓ రాజేంద్రప్రసాద్, ఔట్సోర్సింగ్ సిబ్బంది లింబాద్రిలు కాలనీ వాసులతో కలిసి, ఆ ఇంటి నిర్మాణంపై మున్సిపల్ కు ఫిర్యాదు చేయించారు. ఈ నేపథ్యంలో ఇంటి నిర్మాణానికి సెట్ బ్యాక్ లేదంటూ, నిర్మాణానికి సరైన పరిమిషన్ లేదని పనులు నిలిపివేయాలని డబ్బులు డిమాండ్ చేశారు రాజేంద్ర ప్రసాద్. దీంతో లింబాద్రికి ఫోన్ పే ద్వారా డబ్బులు పంపారు లావణ్య. అయితే దీనిపై ప్రజావాణిలో బాధితురాలు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జిల్లా కలెక్టర్ బీ సత్య ప్రసాద్, బుధవారం టౌన్ ప్లానింగ్ అధికారి రాజేంద్ర ప్రసాద్, ఔట్సోర్సింగ్ సిబ్బంది లింబాద్రిలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.






