- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పవన్ కల్యాణ్ నోట "OG-2" మాట.. స్పెషల్ గెస్ట్ కూడా ఫిక్స్
హన్మకొండలోని తన అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కల్యాణ్ ఓజీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓజీ 2 అప్డేట్ గురించి నిరంజన్ పవన్ కల్యాణ్ ను ఎంతో ఆసక్తిగా ప్రశ్నించడంతో పవన్ స్పందించారు. నువ్వు ఏ మాత్రం అధైర్యపడకుండా చాలా త్వరగా కోలుకోవాలని అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో OG-2 ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఓజీ సినిమా వచ్చిన తరవాత దీనికి సీక్వెల్ కూడా ఉంటుదని ప్రచారం జరిగినా పవన్ కల్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉండటంతో అసలు పార్ట్ 2 ఉంటుందా లేదా అనే ప్రశ్నలు మొదలయ్యాయి. దీంతో అభిమానులు కూడా అయోమయంలో పడ్డారు. అయితే తాజాగా హన్మకొండలోని తన అభిమాని నిరంజన్ ను పరామర్శించిన పవన్ కల్యాణ్ ఓజీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఓజీ 2 అప్డేట్ గురించి నిరంజన్ పవన్ కల్యాణ్ ను ఎంతో ఆసక్తిగా ప్రశ్నించడంతో పవన్ స్పందించారు. నువ్వు ఏ మాత్రం అధైర్యపడకుండా చాలా త్వరగా కోలుకోవాలని అన్నారు.
ఒకవేళ నేను ఓజీ 2 తీస్తే దానికి స్పెషల్ గెస్ట్ నువ్వే అంటూ అభిమానికి పవన్ మాట ఇచ్చాడు. నిన్ను మేము ప్రత్యేకంగా ఆహ్వానిస్తామని చెప్పాడు. పవన్ అలా చెప్పడంతోనే నిరంజన్ మురిసిపోయాడు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ నిరంజన్ ఇంటికి వెళ్లి పరామర్శించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఓజీ సినిమా 2025లో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో ప్రియాంకా అరుళ్ మోహన్, శ్రీయారెడ్డి, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక పవన్ అభిమానులకు బూస్ట్ ఇచ్చిన ఈ సినిమా పార్ట్ 2 వస్తే ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.






