- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐదుగురు అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్ల అరెస్ట్... 200 కేజీల గంజాయి పట్టివేత
విశాఖలో ఐదుగురు అంతర్జాయ డ్రగ్ స్మగ్లర్లను పరవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 200 కేజీల గంజాయితో పాటు నగదు, రెండు కార్లు, బైక్, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ...

దిశ, వెబ్ డెస్క్: విశాఖలో ఐదుగురు అంతర్జాయ డ్రగ్ స్మగ్లర్లను పరవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 200 కేజీల గంజాయితో పాటు నగదు, రెండు కార్లు, బైక్, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు అజ్మల్‌ఖాన్‌కు ఇంటర్నేషన్ స్మగర్లతో సంబంధాలున్నట్లు గుర్తించారు. గతంలో కొలంబోలో డ్రగ్స్ సరఫరా చేస్తూ అజ్మల్ ఖాన్ పట్టుబడ్డారు. తాజాగా పరవాడలో గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అజ్మల్ ఖాన్ స్వస్థలం తమిళనాడులోని రామనాథపురం. అయితే అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నివాసముంటున్నారు. 2022లో శ్రీలంకలో డ్రగ్స్ సరఫరా చేస్తూ దొరికిపోయిన అజ్మల్ ఖాన్ అక్కడి జైలులో మూడేళ్లు శిక్ష అనుభవించారు. బెయిల్ పై విడుదలై భారత్ కు వచ్చి మళ్లీ అదే డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. అజ్మల్ ఖాన్ విచారణతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
శ్రీలంక టు ఇండియా..
శ్రీలంక నుంచి అజ్మల్ ఖాన్ ఇండియాకు వచ్చిన తర్వాత తమిళనాడుకు చెందిన రాజాతో సంబంధాలు కొనసాగించారు. ఏజెన్సీ నుంచి గంజాయిని విజయవాడ, చెన్నై ప్రాంతాలకు తరలించేలా ప్లాన్ చేశారు. పెదబయలు మండలం కోమంగిలో రవి కుమార్ అలియాస్ నానితో గంజాయి కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే అది ఆలస్యంకావడంతో ఒడిషా నుంచి చామ్ ద్వారా గంజాయి కొనుగోలు చేయాలని నిర్ణయించారు. తమ్ముడు అబ్దుల్ రెహమాన్ తో గంజాయి కొనుగోలు చేసిన అజ్మల్ ఖాన్ గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీ కావడంతో ముమ్మరంగా గాలిస్తున్నారు. హవాలా లావాదేవీలు, అంతర్రాష్ట్ర డ్రగ్ నెట్ వర్క్‌పై దర్యాప్తు చేస్తున్నారు.






