- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దమ్ముంటే కాంగ్రెస్ సభ్యత్వం తీసుకో..భోగ శ్రావణి సవాల్
జగిత్యాల ఎమ్మెల్యేకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే కాంగ్రెస్ సభ్యత్వం తీసుకుని ప్రజల మధ్య తిరగాలని భోగ శ్రావణి సవాల్ విసిరారు.

దిశ, జగిత్యాల టౌన్ : జగిత్యాల ఎమ్మెల్యేకు నిజంగా దమ్ము, ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుని ప్రజల మధ్య తిరగాలని బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇన్‌చార్జి భోగ శ్రావణి సవాల్ విసిరారు. చిల్లర రాజకీయాలు మానుకుని ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. జగిత్యాలలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని, అధికారిక కార్యక్రమంలో కనీస మర్యాద పాటించకుండా ప్రతిపక్ష నాయకులను విస్మరించడం బాధాకరమన్నారు. ఎంపీ పాల్గొన్న కార్యక్రమంలో కావాలనే పెయిడ్ బ్యాచ్ తో నినాదాలు చేయించి రెచ్చగొట్టేలా వ్యవహరించారని మండిపడ్డారు.
కేంద్రియ విద్యాలయానికి వాలంతరీ స్థల కేటాయింపును అడ్డుకుంటున్నది ఎవరో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వాలంతరీ భూముల్లో అక్రమ ఆక్రమణలపై జిల్లా కలెక్టర్ విచారణ జరిపించాలని కోరారు. అమృత్ 2.0 నిధులు మంజూరైనా జగిత్యాలలో పనులు ప్రారంభం కాకపోవడం, యావర్ రోడ్ విస్తరణ అంశంలో అనవసర రాజకీయాలు చేయడం అభివృద్ధికి అడ్డంకిగా మారిందన్నారు. ఎమ్మెల్యే రాజకీయ బాగోతాలను ఒక్కొక్కటిగా ప్రజల ముందుకు తీసుకొస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షుడు కొక్కు గంగాధర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముదరాజు, జిల్లా కోశాధికారి సుంకేట దశరథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.






