- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెల రోజుల మిస్టరీకి శవమే జవాబు..!
by Kodari Anjali |
నెల రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన వ్యక్తి మృతదేహం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని గట్టుమల్ల సమీప అటవీ ప్రాంతంలో లభ్యమైంది.

X
దిశ, కారేపల్లి: నెల రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన వ్యక్తి మృతదేహం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండల పరిధిలోని గట్టుమల్ల సమీప అటవీ ప్రాంతంలో లభ్యమైంది. మృతుడు కారేపల్లి మండలం పోలంపల్లి గ్రామానికి చెందిన మూతి వీరభద్రంగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న లక్ష్మీదేవిపల్లి పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడి వద్ద లభించిన ఆధార్ కార్డు, ఫోన్ ఆధారంగా వివరాలు నిర్ధారించి కారేపల్లి పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడికి చేరుకున్నారు. మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతుండగా, శవ పరీక్ష నివేదిక అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని చుంచుపల్లి సీఐ తెలిపారు.
Next Story






